Thursday, February 19, 2015

కాకి గోల
్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్
ఈ పత్రరహితమైన తరువుల తరఫున
మాట్లాడే అధికారం నీకుందా?
ఆ ఇనుపతీగపై ఉతికి ఆరేసిన
ఆమే రాత్రి దుస్తులూ,
అతని పొట్టిచేతులచొక్కా లను
విసురుగావీచే ఈ గాలి
ఏం చేయనున్నదో నీకెరుకనా?
ఈ నల్లటిమేఘాలను గూర్చి
నీకు తెలిసిన సమాచారమేమిటి?
అలాగే ఆకొలను నిండా నిండిపోయిన
రాలిపడిన ఎండుటాకులగూర్చి నీకేం తెలుసు?
ఇంటిముందున ఎండకెండి వానకు తడిసీ
తుప్పు పట్టిపోతున్న కారును గూర్చిన
పూర్తి సమాచారం నీకు తెలుసా?
ముందున్న గోతిలో తాగిపడేడిన
బీరు సీసాలపై తీక్షణంగా
దృష్టి సారించేందుకు నిన్నెవరు అనుమతించారు?
ఇంటిప్రక్కన విధవావిడ ఇంటిముందు
చెట్టుకు ఉయ్యాలనెవరునెవరు వేలాడదీసారో
నీకెమైనా సమాచారముందా?
ఒక్క నిముషం ఈప్రశ్నలన్నింటికీ
సరయిన సమాధానాలు నీదగ్గరున్నాయా లేవో
ఒక్కసారి నీ అంతరంగాన్ని తడిమి చూసుకో
ఈరహదారి మీద ఈ తెల్లటి రంగు గీతలకర్ధమేమిటో
వివరంగా నీకు తెలుసా?
లేదా కాకిలా రెక్కలంగలార్చుకుంటూ
కాకిలా శాఖాచంక్రమణంచేస్తూ
సద్దు చేయకుండా తరలిపో--సరేనా?
[ఓ ఆంగ్ల కవిత ఆధారంగా]
=================================

No comments:

Post a Comment