Saturday, February 28, 2015

షరామామూలే!! తప్పదు చూడండి
            రావెల పురుషోత్తమరావు.
్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్

ఇప్పుడిప్పుడే నా మరో యాత్ర మొదలయింది.
అప్పటికీ ఇప్పటికీ ఈ దారిలో
 చాలా మార్పు చోటుచేసుకున్నట్లుంది.

దూరం అదే గా ఉండిపోయినా
కాలంలో కళ్ళునమ్మలేనంత మార్పు చోటుకుంది.
ఋతువులూ తమవంతు సాయంగా
దశనూ దిశనూ మార్చుకుని
దగాచేయడం మొదలెట్టిందని
ఇట్టే అర్ధమయిపోతున్నది.

పింగాణీ జాడీలమెరుపుకన్నా
రహదారి మాత్రం నున్నగా సిమెంట్తో
ముసిముసి నవ్వులు నవ్వుతున్నట్లు
అవగాహనకు రావడానికి
ఇట్టే సమయంపట్టడంలేదు.

అప్పుడు దారిమధ్యలో వదాన్యులు
ముందు చూపుతో నిర్మించిన సత్రం బావీ
ఎండను మరిచిపోయేలా నీడనందించే వృక్షరాజం
రాజసంతో నాలాంటి పాదచారులను
రారమ్మని ఆహ్వానించే తీరికుండేది.

ఇప్పుడిక్కడ బావిలేదు అందులో
భానుడినిసైతం చల్లబరిచే
బుకెట్ తో తోడుకుని గొంతు తడార్చుకునే
నీటివసతీ మృగ్యమై పోయింది.

ఇప్పుడు ఆ శిధిలమైన సత్రంలో
అధునాతనంగా ఓ కొట్టు వెలిసింది.
ప్లాస్తిక్ బాటిల్ లో నీళ్ళను నింపి విక్రయించే
తంతు ప్రారంభమయింది.
గుట్కాలూ,కూల్డ్రింక్లూ షరా మామూలుగానే
చాటుమాటుగా లభ్యమవుతున్నాయ్ లెండి.

చెట్లన్నీ రహదారి విస్తరణలోఉనికినికోల్పోగా
దారంతా సరిహద్దుల్లో మనరక్షణకోసం
ప్రాణాలను పణంగా పెట్టి భార్యా పిల్లలను
అనాధలుగాజేసి వెళ్ళిపోయిన సైనికుడి
విధవరాలైన భార్యను తలపింపజేస్తున్నది.

వాతా వరణమంతా అతనికోసం శోకతప్తమైన
దేశం లా దీనంగా తరురహితమై దడబుట్టిస్తున్నది.

ఆధునికత మనుషుల సుఖ సంతోషాలనుమరచి
గుత్తేదారుల సౌలభ్యంకో సం విస్మరించబడ్డ నేతల
నిన్నటి వాగ్దానాల్లా ఇవ్వాల్టి బుడ్జెట్లా వెల వెలా బోయిన
మధ్య తరగతి వేతన జీవుల్లో గతంలో పడిన నిప్పులను
విస్మరించేరీతిలో విస్మయం కలిగించి విసనకర్రతో విసరుతూ
బడాబాబులకోసం బంగరు బాటలను నిర్మిస్తూ

బాటంతటా ఎర్ర తివాసీ పరిచి సగటు మనిషి నెత్తిపై
సుత్తితో ఘట్టిగా 'మోదీనట్లయి అరుణారుణ రెఖలా
అతని కంట కన్నీరుకు కారణమయిన క్రూరమైన బుడ్జెట్లా
రక్తకనీరును తెప్పిస్తూ నవ్వమని బలవంత పెట్టి
చక్కలిగిలి పెడుతూ నవ్వమంటూ ఆదేశాలిస్తున్నట్లనిపించి
గుండె నిండుగా విషాదం నింపి నవ్వితే  నవ్వండీ మాకోసం అన్నట్లు

వ్యంగ విలసితంగా ప్రభుత్వం శోభించాలని శతధా
ప్రయత్నిస్తున్న ధోరణి ఇట్టే వ్యక్తమై
 ఇది షరా  మామూలేకదా సోదరా !
 మళ్ళీ ఎన్నికల కలలకోసం ఎదురుచూడమని
మధ్య తరగతిని మందహాసానికి వెలేసినట్లుగా
వెల వెలబోతున్నది. దారంతా ఇక కంటకావృతమే
 దారి తప్పకుండా
జాగరూకత వహించమని హెచ్చరిస్తున్నట్లనిపిస్తున్నది.
*************************************************************[*28-2-15]

No comments:

Post a Comment