Wednesday, February 18, 2015

షరామామూలే --------------
==================
నేనిక వదన గ్రంధం లోకి అడుగుపెట్టాలి
అమ్మ చెప్పగా పుస్తకంలో రాసుకుకున్న
వంటకాలనన్నింటినీ ఇక్కడ
ఇవ్వళ నేనింట్లో చేసినట్టుగా
 నావిగా,  వండి వడ్దించాలి.
కట్టుకున్న మొగుణ్ణి కర్రీ పొయింట్
దగ్గర వదిలేసి వచ్చానిప్పుడే
అది ముఖ పుస్తక మిత్రులెవ్వరూ
గమనించకుండా జాగ్రత్త పడాలి.

ముదివగ్గులైన అమ్మా నాన్నలను
నస భరించలేనని చెప్పి
చెల్లినీ , తమ్ముడినీ, ఒప్పించే ఓపికలేక
వృద్ధాస్రంలోచేర్చి హాయిగా 
గాలి పీల్చుకుంటున్నాను.

అతామామలనెపుడూ ఆప్యాయంగా 
పలకరించిన పాపాన పోలేదన్ 
అవకాశం దొరికినప్పుడల్లా  ఇ
ఆయనెప్పుడూ దెప్పి పోస్తున్నే ఉంటారు.

ఇవ్వళో రేపో "మానవత్వపు పరిమళాల"  పై
నేను చేసిన అంతర్వూహాలానన్నింటినీ
సంపుటిగా తీసుకొచ్చే ప్రయత్నం పూర్తవుతుంది.

ఆవిష్కరణమహొత్సవావానికి అందరూ వచ్చేలా చూసుకోవాలి.
ఇక నేను వదన గ్రంధంలో హృదయదఘ్నంగా ప్రవేశించాలి.
పరకాయప్రవేశం చేస్తున్నానని చుట్టాలంతా
పరిహాసంచేస్తూ ఆటపట్టిస్తుంటారు.
ఇవన్నీ షరా మామూలే నా అభిమాన
 సంఘ సభ్యుల సంఖ్య అందరికన్నా అధికమై వెలగాలి.

అనుకోకుండా లభించిన ఈ మహదవకాశమనే
అఖండజ్యోతిని ఆరకుండా కాపాదుకోవాలి.
________________________________
తా .క : ఇదిఎవరో  ఒక్కరినీ నుద్దెశించనదని
 మాత్రం తలపుకు రానివ్వకండి. 
======================================

No comments:

Post a Comment