Sunday, February 8, 2015

ఆకులో ఆశనై----
*******************

అవును నువ్వంటున్నది నిజమే !
అవును ఈరోజవన్నీ ఎండుటాకులే
కానీ నిన్నటి దినాన అవి
పండుటాకులని గమనించావోలేదో.
మొన్నా అటుమొన్నా అ క్షరాలాఅవి
అరవిరిసిన హరితపత్రాలు.
వసంతర్తు వాగమనంతో హరిత
శోభనద్దుకున్న సౌందర్య విలసిత
రమణీ లలామలు.
కాలంగడుస్తున్న కొద్దీ కళదప్పి 
కళవళ పడుతున్నాయ్ అంతే!

వయసు నొసలుపై 
ముసలి రేఖలుముద్రితం కాకముందు
మాటల తూటాలు ముఖమ్మీదనే పేల్చబడకమున్ను
అవి మౌన ముద్రలో మునిగి వున్నాయి అంతే!
ఇప్పుడవన్నీ దంతాలతో పాటు
పట్తు సడలి వాడుముఖం పెట్టి
వగపు దారిలో పయనిస్తున్నాయని గ్రహించు.
నడువ డానికి అవయవాలు సహరించక
మంచాన బడ్డ ముసలి తనానికి
గతవైభవపు ఘరాన స్మృతులు ఇవన్నీ గమనించు.
రాబోయే కాలంలో కాబోయే స్థితిగతులకు
అవి మనోదర్పణాలనుకుని జాగ్రత్త వహించు!!
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

No comments:

Post a Comment