Tuesday, February 24, 2015

అమ్మ మనకెప్పుడూ అపురూపమైన దేవతా స్వరూపమే.
అమ్మంటే పూర్ణమినాటి పిండారబోసిన పండు వెన్నెల
అతిదగ్గరగా ప్రవహించే అనుభూతుల సెలయేటి గలగలలు.

వసంత కాలపు రాకతో తనివితీరా నవ్వుకునే
లేలేత చివురాకుల సుతిమెత్తని సుకుమారంకూడా  అమ్మేకదా!

అమ్మంటే దినమంతా ఇల్లంతా కలయదిరిగే యంత్రం మాత్రమే కాదు.
అందరి అనుపానులు తెలుసుకుని 
అద్వితీయంగా సహకరించే సౌందర్య సీమ.

అనురాగ సముద్రం--అనుభవాల నరసి పట్టుకునే అందాల మకరందం.
ఇంటి వాకిలిముందు ప్రభాతానికే ముద్రితమై 
సోయగమొలికించే ముత్యాల ముగ్గు.
తోటముంగిటిలో సువాసనల సుమగంధం.
అమ్మంటే గ్రీషర్తువులో అందుకునే నారికేళ ఫలసారం.
హేమంతర్తువులో నులివెచ్చదనాన్నందించే ఊలు శాలువా!
వర్షాకాలంలో తడిసిముద్దయిపోకుండా కాపాడే చత్రం.

శిశిరంలోనయినా కుటుంబ సంక్షే మo కోసం తాపత్రయపడే
రంగు రంగుల రామణీయకమై వెల్లివిరిసే పత్రసౌందర్యం.
+++++++++++++++++++++++++++++++++++++++++

No comments:

Post a Comment