Wednesday, February 4, 2015

జింద్జి మండేలా
-----------
[నెల్సన్ మరియూ విన్నీ మండేలాల చిన్నకూతురు[1959]. రెండు పదులయినా నిండకముండే రెండుకవితా సంపుటులు[1-నేను నల్ల పిల్లనే [2] నలుపు-14] ఎన్నొసాహితీ పత్రికలలో ఆమెకవితలుప్రచురితమయాయి.వర్ణ వివక్షపైన తన అనుభవాలను,సామాజిక సాంస్కృతికపరమైన అంశాలపై స్పందించిన కవితలు ఆమెకు అధిక ఆదరణను అందించాయి.]

నేను చాలా చిన్న పిల్లగా చూసిన దృశ్యకదంబం
-----------------------రావెల పురుషోత్తమ రావు.
అవును నేను చిన్న పిల్లనే
ఒక సారి నెనో తెల్ల పిల్ల వాడిని చూసాను
బడినుంచి వాళ్ళ ఇల్లు చాలా దగ్గరే అయినా అతను కారులో
 రొజూ బడికొస్తాడు మళ్ళీ కారులోనే ఇంతికి తిరిగి వెళతాడు.
కానీ మా ఇల్లు మాత్రం బడికి బాగా దూరంలో ఉంది.
నేను మాత్రం రోజూ బడికి కారులోనే వెళ్ళై
మళ్ళీ బడి అయిపోయాక కాళ్ళీడ్చుకుంటూనే ఇంటికి చేరాలి.


అలాగే నేనింకో అబాయిని చూసాను వాళ్ళకు చాల పెద్ద బంగళాఉంది.
అందులో ఉండేది మాత్రం సరిగ్గా నలుగురు అమ్మా నాన్నా ఆకుర్రాడు ఇంకో చిన్న తమ్ముడు. వాళ్ళిల్లు రోజంతా దీపాలతో ధగద్ధగీయమానంగా దీపకాంతులతో ప్రకాశవంతంగా ఉంటుంది.
మా ఇల్లు మాత్రం చాలా చిన్నది.మొత్తం ఎనిమిదిమందిమీ
తొడతొక్కిడిగా ఆ ఇరుకింట్లొ తిరుగుతుంటాము. ఓ గుడ్ది దీపం వెలుగులో.

నేను అల్లగే ఇంకో అబ్బాయిని చూసాను. వాళ్ళింటికి వెళ్ళే దారి
తారుతో నిత్యం నిగ నిగ లాడుతూ వుంటుంది.
ఎంతో పరిశుభ్రమైన పరిసరాలతో అలరారుతూ ఉంటుంది.

కానీ ఆ దారిలోఎవ్వరూ ఒంటరిగా వెళ్ళిన జాడలేదు.

మాఇల్లున్న ప్రదేశం మాత్రం జన సమ్మర్దంతో తొణికిస లాడుతూ వుంటుంది.
అనుభూతి ప్రధానమైన పలకరింపులతో అనునిత్యం అలరారుతూ ఉంటుంది.
***********************************************

No comments:

Post a Comment