Friday, February 20, 2015

పాంచ భూతాత్మికం--
------------------
ఆకాశమంతటా  నువ్వే విస్తరిస్తూ పోతుంటే
మబ్బు కన్నెలకు నిద్రెక్కడ పడుతుంది?

వనమంతటా నువ్వే పరిమళవీచికలై ప్రభవిస్తే
పూల బాలలకు ప్రశమించే చోటె క్కడుంటుంది?

అంతటా నువ్వే ఆనందార్ణవమై ప్రవహిస్తే
కరుణ రసానికి నిధి ఎక్కడ సంప్రాప్తిస్తుంది?


అంతటా నువ్వే అగ్ని శిఖలను రాజేస్తూ పోతే
కాలుష్యపు కోరలకు దహనమయ్యే తీరికెక్కడ లభిస్తుంది?

భూమ్మీదంతటా  నీ ప్రాభవమే ఋజువౌతుంటే

 ప్రణయమా! వగపుకింక వనవాసమే శిక్షగా మిగులుతుంది.






No comments:

Post a Comment