Tuesday, February 17, 2015

భక్త్యంజలి
============
పరమ శివుని గళ సీమలొ
పాపసరుల దండ
పార్వతమ్మ నునుసిగ్గుల
బుగ్గ సొట్టలె ఇక అండ.

మధుపర్కం మారుగా
తోలుసీర వరుమానం
గిడుపారు కన్నులతొ
విడిదికింక పయనం
మొదటిరాత్రి ఈనాడు
శ్మశానాన పడక
భక్తకోటికందరికీ
బూదితొ విందు భోజనమని
వారికందరికీ ఎరుక

శివరాత్రి నాడు చేయు
శివపూజలె మన కభయం
అండనుండు మనకికపై
వాగర్ధపు దాంపత్యం.
 ఇతిశివం బహుదా శుభకరం

మహాశివరాత్రి భువినంతా పర్వదినం
శివనామ స్మరణమే సర్వత్రా శుభకరం
మహాశివుని అభిషేకములే
మానవాళికి మంగళప్రదం.
=============================

No comments:

Post a Comment