Thursday, February 26, 2015

అమృతం కురిపించిన రాత్రి
-----------------------
నాజీవితంలో ఆనందమయిన రాత్రులు
నేనస్సలు బయటికి వెళ్ళవలసిన అవసరం రానివేసుమా!
అమ్మయ్య ఇవాలెక్కడికీ వెళ్ళనక్కరలేదు ఎంత హాయి ఈ రేయి
అంటూ పాత పాటను నెమరేస్తున్నది ఇంటావిడ హుషారుగా.
ఈలంటూ వేయడంవస్తే ఆపనికూడా చేసేసివుండునేమో ఆనందానికి.

హాయిగా ఈజీ చైర్లో తనువును ఆనించుకుంటూ
ఆవిడందించిన వేడి వేది కాఫీని చుక్క చుక్క సేవిస్తూంటే దొక
చెప్పలేని హాయి నులివెచ్చగా గొంతుదిగుతుంటుండి.
ఇష్టమైన ఓ చలం పుస్తకమో లతమ్మ మోహన వంసీనో
గోపీచంద్ గారి యమపాశమో చదువుతూ
మధ్య మధ్యలో తంపటిన వేరుశనగలనో

ఉడకబెట్ట్తిన కంది కాయలనో ఒక్కొక్కటే వొలుచుకుని తింటూ.

భోజనానికేం తొందరలేదు,నువ్వు తినాలనుకుంటే తినేసెయ్
ఈపుస్తకంగంటలో లాగించేస్తాను,సరేనా అంటే
ఆమే చిరునవ్వుతో అలాగే అని ఓ చిరునవ్వును విసిరేసి 
నాప్రక్కన ఓ వారపత్రికను చేతులో దొరకబుచ్చికొని
వారం వారం జీడిపాకంలా సీరియల్నవలను నమిలేస్తూ
ఆవిడానేనూ, ఇవ్వళ బయటికెళ్ళే పని లెదని
సంతోష పడుతూ ఇంతకన్నా ఈజీవితానికింకేం కావాలి
జీవితమే మధురమూ రాగ సుధా భరితమూ ప్రేమకధా 
మధురమూ ఈ దాంప త్యసీమ అంటూ ఆరాత్రిని
అమృతం కురిసిన రాత్రికన్నా అపురూపంగా తలుచుకుంటూ. 
==========================================

No comments:

Post a Comment