Tuesday, February 3, 2015

వూసుల వుయ్యాల--------------------
ప్రభాత సమయాన మన పూలతోటలోయే పూవును పలకరించినా నీ వూసులేనెమరు వేయడం చూసాను.శిశిరంలోకూడా చిగురించే నీ చిరుదరహాసమేపదే పదే గుర్తుకొచ్చి తలపంకిస్తూ కూర్చుంటాను.
యే కోయిల గానం విన్నా  అది నీ మురిపెంకోసమేననిగ్రహించి పులకాంకితుడనౌతుంటాను.
వెన్నెల్లో మెరిసే చందమామకూడా జ్యోత్స్నాభిసారికలానీ రాకకోసమే ప్రతీక్ష చేసున్నదేమోననిపిస్తుంది.
ఇలా అంతా నీ నామ స్మరణలోనూ, ఊహల ఊసుల్లోనూకాలం గడుపుతుంటే నీవు నన్ను విడిచి ఎక్కడకు వెళ్ళలేదన్నఅసత్యం సత్యమార్గం వైపు నన్ను నడిపించడం నవ్వు తెప్పిస్తున్నది సుమా.అందుకే ప్రేమతో ఏకమైన మనంప్రేమానుబంధమే గొప్పదని పదే పదే గుర్తుచేసుకుంటూ గడిపేద్దాం.^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^


No comments:

Post a Comment