Friday, February 6, 2015

బుచ్చిబాబు వచన కావ్యం అజ్ఞానం
-------------------------------
1985   మే 5 సంచికనుంచి--పునః స్వీకారం]---రావెల పురుషోత్తమరావు[రాపు]
-----------------------------------
తెలుగు కధానికను కవితామయంగా తీర్చిదిద్ది పాఠకుల మనోఫలకాలపై చెరగని ముద్రను చిత్రించిన కధాకధన శిల్పి. బుచ్చిబాబు. మనిషి అంతరంగాన్ని మరీ మరీ మదించి ఆమనోవిష్లేషణద్వారా ఓ కొత్త వరవడికి బాటలు వేసిన తాత్వికుడు.
బుచ్చిబాబు కేవలం ఒక్క నవలను [చివరకు మిగిలేది] చిరస్మరణీయమైన ఖ్యాతి నార్జించారు.తెలుగు నవలా ప్రపంచానికి అది మణిహారంగా నిలిచిపోవడం యాదృచ్చికంకాదు.ఆనవల తరువాత ఎందరికో నవలా రచనలో మార్గ దర్శనం చేయడం మనమందరమెరిగినదే.దయానిధి మనస్తత్వ పరిశీలన-పరిశోధనకవసరమయిన విషయానందించిందని చెప్పుకోవడం అతిశయోక్తి కానేరదు.అలాగే అమృతం కోమలి ఎవరికి వారే పాఠకుల మనసులను ఇట్టే దోచుకోగలిగారు.కేవలం ఒక సారి చదివితే తేలిగ్గా అవగాహనయే నవల కాదిది.తర్వాత తర్వాత చదువుతున్న కొద్దీ నూతన కోణాలను ఆవిష్కరింపగల నైపుణ్యం ఈ నవలది.దయానిధి సౌందర్య దాహానికి బాహ్య రూపం కోమలి. ఎడారిలాంటి దయానిధి బ్రదుక్కి  ఒయాసిస్సులా సాక్షాత్కరిస్తుంది.అమృతం.ఇలా ఒక జీవన సౌందర్యాన్ని చిత్రించిన ఘనత బుచ్చిబాబుది.

బుచ్చి బాబు వ్రాసిన 'అజ్ఞానం' 12 కవితాఖండికల సుమహారం.
సమకాలీన సమాజజీవితాన్ని చిత్రిక పట్టాలనే తపన, ఆకాంఖతో బుచ్చిబాబు గారీ కవితలను గుది గుచ్చడం జరిగింది.
మొదటి కవితా ఖండిక- అజ్ఞానం--అ అన్న అక్షరం తో ఆరంభించి ఆ అక్షరం చుట్తూ తన కవితను సుందరంగా పరిభ్రమింపజేస్తాడు కవి.

     అబద్ధానికి నాంది
అశుద్ధానికి ప్రస్తావన
అక్కా అన్నా అయ్యాక అయ్య
ఆ అయ్యవెనుక అమ్మనోరు
ఆ పైని అదికారి
అతనిపైన అది పేరు లేని పెండ్లాం
ఆఖరుకు అల్లా అంటూ ప్రారంభించి,

రాణికోసం రాజుకాడోయ్
రాజ్యం కోసం రాజు
రాణీ మరణం తర్వాత
సోఫా ఖాళీ అవడం
రేపో మాపో మరో రాణీ అవతరణ అంటూ
రాజ్యం పోతే రాణీలేదూ రాజూలేడు
వారిని మోసే మజ్దూర్కే మోక్షం అంటూ రాచరికపు వ్యవష్త పై వ్యంగ బాణాలను సంధిస్తారు.

రెండో కవిత ఆకలిదప్పులు
 తేనే చక్కెర, పటిక బెల్లం
చెరుకుముక్క తాటిపండు
క్రిస్మస్ కేక్ అండ్ క్రీం
ప్రేయసి పెదవి తీపిముందు
అన్న్నీ దిగదుడుపు
అన్నిటికన్నా మధురమైనది ఆకలి
అలాగే చందమామకేసి చేతులు చాచే
 చంటిపాప పిలుపు మదురాతి మధురమైనది. అంటూ

   రాత్రి పీల్చిన మంచులో
ఆమనులో తొరిపినతేనెలో
రవ్వంతతడిసిన రాగం చిమ్మే
పుష్పం కడు రమణీయమైనది.
అని ఒక కుసుమపేసలమైన సుందర దృస్యాన్ని చిత్ర్ర్కరించి చూపు తాడు. ర్తన అక్షరాలతో రంగులద్దుతూ.

ఇక మూడో కవిత దాగుడు మూతలు
చెప్పేదొకటి చేసే దొకటి మనస్తత్వం
 గాలికి చెనంప పెట్తులా ఈ కవిత

   కులమతానికి స్వస్తి
కొంప దగ్గర వేరే విస్తరి మహా పతివ్రత, సదాచారం
రాత్రయేసరికి వ్యభిచారం
నైతిక పరపతి శూన్యం
ప్రతి పైసాకీ కక్కుర్తి. అంటూ
  ప్రపంచ శాంతి స్థాపన పేరిట
ప్రక్కింటి పరంధామయ్య ని ఖూనీ.
అని ద్వంద మనస్తత్వం గలవారిని తూర్పారా బడతాడు.

ఇరుగు పొరుగు వారి కార్య కలాపాలు ఒక్కోసారి ఎంత ఇబ్బంది పెడతాయో తెలిపేది  నాలుగోకవిత 'చతురస్ర గతీ

 చెవులకు చిల్లులు పొడిచే మైక్రోఫోంతమ్ముడి చదువుకు అవరోధం కలిగించి పరీక్షా కాలంలో ఇబ్బంది కలిగిస్తుంది.
అలాగె తలంటుకు కుంకుడు కాయలు కొడితే

కిందివాటాలో ని వాడి తలపగలాలా?
ధాన్యం దంపుడుతో ప్రక్క యింటి నేస్తం
పరారయి పలాయనం చిత్తగించాలా
అని మనం నిత్య జీవితంలో ఎదురయే సంఘటలను వివరిస్తాడు.అవి ఎంత కంటగింపుకు కారణమో విశదీకరిస్తాడు.

తరువాత కవిత చైనా గోడ

---------
బౌద్ధానికి నిచ్చెనగా బాయొనెట్లుకాదన్న
పసికందుకు ఉయ్యాలతాడే ఉరిత్రాడు.
కన్నె పిల్ల కళ్ళల్లోకి గూఢాచారి
క్రీగంటి చూపు.
ఊరంతా స్వతంత్ర గాముల గోరీలే
ఇల్లంతటా నియంతల కంతల గోడలే
అది చాలదన్నట్లు చైనా గోడ.

స్వార్ధం ఈర్ష్యా చైనా గోడకు ఇటుక
ద్వేషం, పగ,భయం ఎర్ర సున్నం
పిరికితనం పైన కప్పిన పెంకు
సరసం తెలీని సరస్సులు
దోవతప్పిన నదులు
భూమట్టమైన స్వతంత్ర శిఖరాలు.
అన్నీ శిధిలమవగా మిగిలిన చైనా గోడ.
అని గోడ కట్తిన సామాగ్రినంతతినీ
కవితమయం చేసి కళ్ళు తెర్పిస్తాడు.
నేనేడవనెందుకో అన్న తరువాతి కవితలో
అప్పుడెవ్వరో ఆకలో అమ్మా అంటే ఏడ్చాను.
కనీరంతా ఖర్చయిపోయింది.
ఆసుపరిలో  ఎవరో అమ్మో అంటే
ఆకేక విని వలవలా ఏడ్చాను
నడిఒడ్డున అంగుళం మేరని స్నానంజేసి
బెత్తెడు ఇసుకలో వోణీ వేసుకున్న
ఆ పిల్ల తడి అందానికి వెక్కి వెక్కి ఏడ్చాను.

అందరి ఏడ్పులూ నేనే ఏద్చాను
కన్నీరంతా ఖర్చయిపోయింది.
మరిప్పుడేడుపేరావడంలేదు--అంటూ
తన దయార్ద్ర హృదయాన్ని ఆవిషరించారు.

ఆ తరువాతి కవిత ఏవరో

  ఎముకల్ని విరగ్గోట్టి
రక్తంలోముంచి
నరాలను పీడించి
మానవత్వాన్ని
ఒక్క మాటలో ఓ డించి
వ్రాసి ముగించాను తయారయిందిప్పుడు
ఎవరి ఆకలి కధనమో!

అలాగే
  ద్రుపది ఒంటిని దాచిన

చీర పరంపరలు
చీనీ చీనాంబరాలు
కాషాయవస్త్రాలు
ఒళ్ళూమండి కొంపకెళ్ళి
నేసాను ఎవరి మగ్గం పైనో.

కౌగలించుకుని చుంబించాను
 ఎవరి ప్రేయసినో

ఒళ్ళు మండికొంపకెళ్ళి
పాడుకొన్నాను ఎవరి పదాన్నో
------
అద్దంలో చూసుకున్నాను ఎవరి మొహాన్నో! అంటూ

పత్రిక విప్పితే
ఎవడో చచ్చాడు
అనుక్షణం ఎవ్వరో ఒకరు చస్తూనే వున్నాడు,
మేకలు మనుషులు
ముంగిసలూ మూకలు
పులులూ పల్లె పడుచులూ
వయో వృద్ధులూ వసి వాడని పసికందులూ
ఇందరిందరూ అంతంతటా
చస్తూనేవున్నారు
ఎవరి చావో నన్నేల చావనివ్వవు పరమాత్మా!
అని నిగ్గదీసి ప్రశ్నిస్తాడు కవి.

 నేనేడవనెందుకో అన్న తరువాతి కవితలో
అప్పుడెవ్వరో ఆకలో అమ్మా అంటే ఏడ్చాను.
కనీరంతా ఖర్చయిపోయింది.
ఆసుపరిలో  ఎవరో అమ్మో అంటే
ఆకేక విని వలవలా ఏడ్చాను
నడిఒడ్డున అంగుళం మేరని స్నానంజేసి
బెత్తెడు ఇసుకలో వోణీ వేసుకున్న
ఆ పిల్ల తడి అందానికి వెక్కి వెక్కి ఏడ్చాను.

అందరి ఏడ్పులూ నేనే ఏద్చాను
కన్నీరంతా ఖర్చయిపోయింది.
మరిప్పుడేడుపేరావడంలేదు--అంటూ
తన దయార్ద్ర హృదయాన్ని ఆవిషరించారు.

ఆ తరువాతి కవిత ఏవరో

  ఎముకల్ని విరగ్గోట్టి
రక్తంలోముంచి
నరాలను పీడించి
మానవత్వాన్ని
ఒక్క మాటలో ఓ డించి
వ్రాసి ముగించాను తయారయిందిప్పుడు
ఎవరి ఆకలి కధనమో!

అలాగే
  ద్రుపది ఒంటిని దాచిన

చీర పరంపరలు
చీనీ చీనాంబరాలు
కాషాయవస్త్రాలు
ఒళ్ళూమండి కొంపకెళ్ళి
నేసాను ఎవరి మగ్గం పైనో.

కౌగలించుకుని చుంబించాను
 ఎవరి ప్రేయసినో

ఒళ్ళు మండికొంపకెళ్ళి
పాడుకొన్నాను ఎవరి పదాన్నో
------
అద్దంలో చూసుకున్నాను ఎవరి మొహాన్నో! అంటూ

పత్రిక విప్పితే
ఎవడో చచ్చాడు
అనుక్షణం ఎవ్వరో ఒకరు చస్తూనే వున్నాడు,
మేకలు మనుషులు
ముంగిసలూ మూకలు
పులులూ పల్లె పడుచులూ
వయో వృద్ధులూ వసి వాడని పసికందులూ
ఇందరిందరూ అంతంతటా
చస్తూనేవున్నారు
ఎవరి చావో నన్నేల చావనివ్వవు పరమాత్మా!
అని నిగ్గదీసి ప్రశ్నిస్తాడు కవి.

ఎనిమిదోకవిత "ప్రపంచ పొరుడా జోహారు!"అన్నది

సంతానం కనకు
అడివికొట్టి జాగా చేయకు
సంద్రంలో ఉప్పును నాకి హుళక్కీ చేయకు.
సూర్యుడితో అగ్గిపుల్ల ముట్టించకు
నీ బిడ్దలకు బడి కట్టించకు
ఐదఘుల చదరపడుగుల
నేలను వెతుక్కో
వీలునామా వ్రాసే అవస్థ లేదు--రాదు కూడా
అంటూ
పుట్టని సంతానానికి నీపేరే పెడతాం
ఆలయంలోనువ్వు వెలుపల మేం
అంతర్ధానమై మా స్వప్నంలో కనబడగలిగితే నీకు మా జోహారు. అని చమత్కరిస్తాడు.
'నాకు జబ్బు చేసిందీ అన్నది పదోకవిత ఇందులో లోకంలో వున్న రకరకాల జబ్బులలిస్టులనూ వాట్కి చక్కని ప్రిస్క్రిప్షన్ ఉదాహరిస్తాడు. చలా వడి వడిగా నడిచే కవిత ఇది.ఇందులో బుచ్చిబాబుగారికున్న ప్రపంచ జ్ఞానం
మనకు సుబోధకమై నిలుస్తుంది.

కట్నంతో కన్నె పిల్ల
భర్తే దైవం
కుచేల సంతానం
కార్మికుల స్వర్గం
కాన్సర్ టీబీల కలసివున్న కాపురం
కూడులేని బిడ్డలే కర్షకుల ధాన్యం
అని నొక్కి వక్కాణిస్తూ

అంతేనా గుడ్దిలోకం
చరిత్ర చినుగులు కుడతావా?
నాకరికత శిధిలంపైనా నీ మకాం
కరుణ చూపని దైవమేనా నీ మొగుడు?
ఆకలి బాధల్ని కన్నావా
గతాన్ని పొట్టన బెట్టుకుని
లావైనావుగానీచావులేదా నీకు గుడ్డిలోకమా
అని గుచ్చి గుచ్చి తరచి తరచీ ప్రశ్ణీస్తాడు,

ప్రేమ పచ్చది
కీర్తికి ఎరుపు
హోదాకి ఆకు పచ్చ
ధనానికి నలుపు
వైరాగ్యానికి తెలుపు
అన్నీ వున్న వాడికేమో  నా గుడ్ది కన్ను!
ఇవ్వండిక మీ కళ్ళకొలతలు
చచ్చిన మర్నాడు సరుకు సిద్ధం అని ఘంటా పధంగా చెప్తాడు తనమనో భావాలను కవి.

ఆఖరి కవిత అన్నింటిలోనూ సుదీర్ఘమైనది.

యుద్ధంలో శిధిలమైన
కొండ శిబిరం వలె
దుఃఖంలో ఏకమైన మంచు శిఖరాలు,
మంచుని మించిని మించిన తెల్లటి మందహాసం
మనలోమానవుడి వుయ్యాల.
మన శిఖరాలు అతని ఆదర్శం.
నానిశ్శబ్దం కవితంటాడు
నాఉనికే చిత్రకళంటాడు
నారక్తం అతని గుండెమీది గులాబీ పుష్పం.
నాతెలుపు అతని హృదయం
నాకంటీత్తు అతని ఆదర్శ శిఖరం
నాకంటె వెడల్పు అతని మానవ తత్వం
----
--
అతని ఎముక నా వెన్నెముక
అతని కన్ను మూత నా స్వప్న.ం
---
పచ్చ కొండలో పుడతాను
మనిషి గుండెలోకెడతాను.
అతనేనేను
నేనే అతను
అంటూ వచన కావ్యాన్ని ముగిస్తాడు బుచ్చి బాబు.

బుచ్చిబాబు ఆ సమయానికి కేవలం నినాదాలతో నింపబడి నిస్సారమైపోఉన్న
కవితామతల్లికి సుమహారంగా సహితీ సుగతునికి అన్వర్ధమైన స్వాగతం పలికేలా
తన వచన కావ్యాన్ని అందిస్తాడు.మానవత్వాన్ని దాని విలువల్ని చాటే విధంగా మనకొక చిత్రరూప దర్శనం గావించారు ఈ కావ్యంతో ప్రతిభాశాలిగా బుచ్చిబాబు .
*********************************************************************************

No comments:

Post a Comment