Tuesday, February 17, 2015

నలభయ్యో పడిలో--నరుని బ్రదుకు
-----------------రావెల పురుషోత్తమ రావు.
నలభయ్యోపడినంతనే
మనుషుల తీరులో అనేక  మార్పులు సంభవిస్తాయి.
అవి మరీ కొట్టొచ్చిన రీతిలో
మనకు అనునిత్యం సాక్షాత్కరిస్తాయి.
వాళ్ళు వదిలి వచ్చిన గది తలుపులకు
గడియలుతరచుగా  బిగిస్తూ వుంటారు.
గట్టిగా తాళాలు వేసి లాగి మరీ చూస్తారు.

నలభై మెట్లదారిలో సగం మెట్లలోనే
ఒ మజిలీ ని సృష్టించుకుని మరీ ఆగుతాతారు.

ఆ దారినెప్పుడూ చూడని వారిలా 
ఎగాదిగా చూస్తుంటారు.

నదీ ప్రవాహంలో తొణికే పడవలా
కొద్దిగా చలన సహితమై కనబడతారు.

ఎదురుగా అమర్చబడ్డ నిలువుటద్దంలో 
దూరంగా నిలబడి  జుట్టును సవరించుకుంటూ
దుస్తులను సర్దుకుంటుంటారు.
మెడకు టై కట్టుకునే కొడుకులో తన బాల్యాన్ని
గమనించి గుండె నిండా నవ్వుకుంటారు.
ఆక్షణంలో ఆ తండ్రి మొహంలో
నులివెచ్చదనం చోటుచేసుకుని
మెరుపు తీగలా ఆనంద రేఖను
మురిపెంతో ప్రతిబింబిస్తుంటారు.
ఆ ఆనందం అసుర సంధ్య వేళలో 
మెల్ల మెలగా వినబడే పక్షిగణపు
కిల కిలారవాల్లా దూరంగా వన సమూహం నుంచి
తొంగి చూస్తున్నట్లుగా వినబడుతుంది.
తన ఇంటిదాకా ఆవిహంగతతి తోడూ నీడగా
అనుసరిస్తున్నట్లు లీలగా కనుపిస్తుంది.
************************************************
         [ఓ ఆంగ్లకవిత ఆధారంగా]

No comments:

Post a Comment