Friday, February 13, 2015

వాస్తవస్తవం---రావెల పురుషోత్తమ రావు
********************************************
అవును ఇది నువ్వన్నట్లు ప్రేమికుల దినోత్సవమే

నేను భూమ్మీద పడినంతనే గుక్కపెట్టి ఏడుస్తుంటే
ఓచిరునవ్వును నాపై విసిరి నొసటనుముద్దిడి
తన వక్షోజాన్నందిoచి ప్రప్రధమంగా ,ప్రేమమాధుర్యాన్ని
చవిచూపిన అమ్మను ఇంకా ఇలా, ప్రేమిచడం తప్పా!

నా బుడి బిడి నడకలకు లోలోననే గర్వపడుతూ
నాకు విద్యాబుద్ధులను నేర్పిస్తూ అడుగడుగునా
నన్ను వెన్నెముకలా వెన్నంటిముందుకు నడిపించిన
నాన్నను ఎలా మరువమంటావు ఈ శుభ దినాన ?

అక్షరాభ్యాసంతోమొదలెట్టి అలిఖితంగా నాపై

ప్రేమామృత వర్షాన్ని కురిపిస్తూనా అభివృద్ధికి
తనవంతు సాయంగా చేయూత నందించి ఇవ్వాళ
నాజీవనగమనం ఇంత సుగమం గా సాగేందుకు
సహకరించిన వివిధ దశల్లోని గురువులను ప్రేమించడం
ఎలా మరువగలను చెప్పు నేస్తం--అందుకే వారికి పేరు పేరునా

ఈ గులాబీ గుచ్చాలను ప్రేమ పురస్సరంగా ప్రప్రధమంగా
అందించి నా కృతజ్ఞతా భావాన్ని ప్రకటించుకోవాలని
గట్టిగా తీర్మానించుకున్నాను--ఆతర్వాతే ఎవరికైనా

నా పురస్కారాల ప్రదానం--ఇది ముమ్మాటికీనిజమ్మిత్రమా!
-------------------------------------------------------------------------------12-2-15

No comments:

Post a Comment