Saturday, February 14, 2015

ప్రేమా!! నన్ను మనసారా క్షమించు.
******************రావెల పురుషోత్తమరావు.
--------------------------------------------
ప్రేమా! నన్ను మనసారా మన్నించు.
 నిన్ను ద్వేషిస్తున్నందుకు
నన్ను మనసారా క్షమించు.
ఒకప్పుడు విశ్వమంతటా
 ఎంతగానో.   భృశార్ధంతో
కీర్తించబడి శ్లాఘనీయమై
విరాజిల్లిన నీవు
కాలంగడుస్తున్న కొద్దీ
సంకుచితత్వంతో సగం చచ్చి
చిక్కి శల్యమై కృశించి
నీరసపడిపోతున్నావ్  గ్రహించావా?

ఇంట్లో కళ్ళెదుట కనుపించే
అమ్మ,అక్క,చెల్లిని అత్మీయంగా
పలికరిచనోపని వాడు
బజారులోకడుగుపెట్టగానే
బరితెగించి
వ్యాఖ్యానాలను విసురుతూ
స్త్రీత్వాన్ని కంటగింపు కలిగించేలా
పరిమారుస్తున్నాడు.

బస్ స్తాపులోనూ వాడే
జనసంచారంకిక్కిరిసివున్న ప్రతిచోటా
వాడే ప్రత్యక్షమై పళ్ళికిలిస్తూ
ఆపదం పలుకుతుంటెనే పరమ చిరాకును
పుట్టీస్తున్నాడు,కిరాతకపు నవ్వులతో
ఉవిదలను ఉడికించాలని చూస్తున్నాడు.

శబ్దార్ధాల సం యోజనకు శర సంధానపు
బిగువుంటుందని మరిచినసినీ గేయ రచయితలు
ఆ పదం పలకాలంటేనే కంపరంపుట్టేలా
గీతాలను గిలికి జనాలపైకి మసిగుడ్డలా
మీద పడేలా త్రిభాషా సుత్రాలను
మొక్కవోకుండా పాటిస్తూ మణి ప్రవాళ
శైలికే మచ్చను ఆపాదిస్తున్నారు.

ఐదుపదులు దాటిన నాయకుడి ఒత్తులురాని
భాషా ప్రకటనలో స్వారాస్యం కోల్ప్యేలా
దీన్ని ఉచ్చరించి అధమాధంగా తీర్చి దిద్దుతున్నారు.
అందుకే ధారావాహికలలో వినిపించే ఏడుపులా
చిరాకుకు ప్రతిరూపంగా ఈ పదం
సార్ధకమై నిలుస్తున్నది. అందుకే ప్రేమానీకు
అడుగడుగునా సందిస్తున్నా దివ్య మంగళ హారతులు.

No comments:

Post a Comment