Wednesday, February 11, 2015

జీవ నదిలా ప్రవహించేలా--రావెల పురుషోత్తమ రావు.
*********************************************************

అవును నీవంటున్నది అక్షర సత్యమే కాదనను

ఆవొడ్దున  అగ్ని శిఖలా రగులుతూ నేను
ఈదరిన మంచు శిఖలా ఘనీభవిస్తూ నీవు
ఎంతకాలమని ఇలా అంతరంగంలో రాజుకుంటున్న
వై షమ్యాలను కడిగేసుకుండా
 కాలాన్ని ఖర్చు చేసుకుంటూ వృధాగా బ్రదకడం?
ఇద్దరిమధ్యా అగాధాల అంచులనoటి ప్రవహిస్తున్న
ద్వేషా భావాల మలిన సరస్సులను నియంత్రిద్దాం.

శతృవు మనస్సులో  మనల్ను నామరూపాల్లేకుండా
తుదముట్టించాలన్న కోరికలు బలపడకముందే
మన మనసుల్లో అనాదిగా పేరుకుంటూ వస్తున్న వైషమ్యాలను
కడిగేసుకునే ప్రయత్నాలను వెన్వెంటనే ప్రారంభిద్దాం.

చేయీ చేయీ కలిపి నడకను సాగిస్తూ చైతన్య శిఖరాల
నధిరోహించే ప్రయత్నాలను  శీఘ్రమైన దశలో ప్రారంభిద్దాం.

అనితరసాధ్యమనుకుంటున్న మన ఐక్యతా రాగాన్ని
ఆత్మీయంగా ఆలపించడం తక్షణం మొదలెడదాం.

దూర దూర తీరాలనన్నింటినీ కలిపి కుట్టే శ్రమలో
సహకరించుకుంటూ స్వేదఫలాలను తరువాతి తరాలకు
స్వాదు  యోగ్యంగా మార్చి  అందించే ప్రయత్నాలకు

నాందీ వచనాలు పలుకుదాం. రా!!!  ఈదరికి నిర్మాణాత్మకమైన యోచనలతో .
నిరంతరాయంగా మన కట్టుబాటును  జీవ నదిలా ప్రవహించేలా చూద్దాం.
--------------------------------------------------------------------------------------------------------------11-2-15

No comments:

Post a Comment