Wednesday, February 25, 2015

మన్నించి వదిలేసి--
================రావెలపురుషోత్తమరావు.
**************************************
ఇప్పుడు మౌనం మాట్లాడినా
నిశ్శబ్దాన్ని నిఉవెత్తునా నిండు  కౌగిలిలొ
నలిపి నమిలేసినా ప్రయోజనమేముంది?

నేరమంతా జరిగి దొంగలంతా జారుకున్నాక
ఆప్రదేశానికి ఆదరా బాదరా రొప్పుకుంటూ
రోజుకుంటూ, రక్షక భటసమూహం
ఈగల్లానో దోమల్లానో వచ్చి వాలినట్లు.

ఆడతనాన్ని అందంగా చూపిస్తున్నానని
అర్ధ నగ్నంగానో అసలు నగ్న స్వరూపానికి
అతిదగ్గర గానో సౌందర్యాన్ని హరించేసాక
ఇప్పుడు ఆమౌన ఋషి మాట్లాడి లాభం యేముంది.

నాభి చుట్టూ కటి చుట్టూ వలయాకారంలో
మీద విసరగా ఫలక్షతాల గాయాలు మానతాయా?

ఆడతనమే శాపమయిందనుకునే కన్నె పిల్లల తల్లిదండ్రుల
మౌనంగా ఆలపించిన శోకండాలకు చరమగీతం పడుతుందా?

జరుగుతున్న అత్యాచారాలకు నేపధ్యం ఈ దృశ్య సంపద
కారణంకాకుండా పోతుందా? క్షణం క్షణం
ఆ అడవిరాముడి దెబ్బలకు ఆక్రందించిన ఆడతనం

ఊరడింప బడి ఉన్నతంగా జనాల మనో ఫలకాలపై
కొత్తముద్రలను ముద్రించగలుగుతుందా?

ఇప్పుడింకామౌనం మాట్లాడినా ఒకటే ఈ మూగతనం
ముసిముసి నవ్వులతో మురిసిపోయే గడువు మించిపోయింది.

మనుషుల్లారా !!మన్నించి వదిలేయండి.
క్షత గాత్రాలపై చణకులు సంధించడం మానేయండి.
మన్నించి వదిలేసి-- మామానాన్న మమ్మల్ను బ్రదికేలా

త్యాగమూర్తుల్లా -మీదారిన మీరు --చిత్తగించండి.
=========================================

No comments:

Post a Comment