Saturday, February 14, 2015

ఋతు శోభ---
---------
వసంతం ముఖద్వారంచెంతన
నిలబడి చిరుదరహాసాలను చిందిస్తుంటే
మనసంతాలేలేతమామిడి చివురులనాస్వాదించే
పుంస్కోకిల స్వరంలా హాయిని పుణికిపుచ్చుకుంటుంది.

హిమసౌరభం తలుపు తట్టినా నావలపు తోటపై
చిరుజల్లులా హర్షాతిరేకపుముత్యాలను వెదజల్లినా
నాలో మృదు హాసాల హేమంతం నవ్వులు చిందిస్తున్నట్లు గోచరమౌతుంది.

శరత్జ్యోత్స్నల సమయమంతా నెచ్చెలి నులివెచ్చదనంకొసం
పరితపించే అభిసారికలా సాక్షాత్కరిస్తుంది.

శిశిరాగమనమే కొంత చిరాకును కలిగించి విషణ్ణ వదనాన్ని
కానుకగా అందించి నిష్క్రమిస్తుం ది.

ఈఋతు నర్తనమంతా జీవన గమనపు పలు దశలను
ఆవిష్కరించి అడుగడుగునా  ఆహ్వానాలనందిస్తున్నట్లు స్ఫురిస్తుంది.
=========================================

No comments:

Post a Comment