Thursday, February 5, 2015

విజేతలు
-----------

మా ఊరి ప్రక్కగా   అనామకమైన ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది.

ఆ నదిగుండా ప్రవహించేది నెత్తురనీ, కన్నీరనీ అందరూ భావిస్తుంటారు.
కానీ నేతలు మాత్రం అది స్వచ్చమైందనీ,ఆరోగ్య ప్రసాదిని యనీ ప్రచారం చేస్తారు,

ఆనీటిచుక్కనెవ్వరూ ఇప్పటిదాకా నాలుకపైన  వేసుకున్న ప్రాణి వొక్కటీ లేదు

తాగితే బ్రదికి బట్టగలమన్న ధైర్యం యే ప్రాణికీ ఎప్పుడూ ఉన్నట్లు లేదు.

మావూర్లోనే చెరువు గట్టున ఓ అజ్ఞాతంగా ఎదిగిన తరువొకటుంది.

కొందరు అది సంతాపహేతువనీ మరికొందరు అది మృత్యు గహ్వరమనీ విశ్వసిస్తుంటారు.
మా నాయకులు మాత్రం అది కల్పతరువనీ ఆరోగ్య హేతువనీ ఊరూరా ప్రచారం చేస్తుటారు,
కానీ ఎవ్వరూ ఆ తరు ఫలాలు స్వాదుయోగ్యమని ఖాద్య ఫలాలనీ నమ్మడంలేదు.

మావూర్లో అజ్ఞాతమైన నదీ, అనామక  తరువూ, అలానే వున్నాయి;

వాటి శరీరాన్నీ నెత్తుటినీ, ఎవ్వరూ
గుర్తించి  గౌరవించిన దాఖాలాలు మాత్రంలేవు.

మా నాయకులు అలానే ఇంకా ప్రచారం చేస్తూనే వున్నారు ,ప్రజలు విశ్వసించకున్నా
అయినా వాళ్ళు ప్రతిసారీ ప్రజా ప్రతినిధులుగా గెలుస్తూనే వున్నారు,

[zindzi mandela-----ఆంగ్ల కవితకు స్వేచ్చానువాదం]      5-2-15

No comments:

Post a Comment