Sunday, February 22, 2015

కావ్యావతరణం--
-----------------రావెల పురుషోత్తమ రావు.
్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్
కవులెందుకు కావ్యాలను
వెలయిస్తారో తెలియడంలేదు.
అష్టాదశవర్ణలతో అధిష్టాన దేవతలను
పౌరాణికాలనుంచి పట్టుకొచ్చి
అసమానమైన పాతివ్రత్యపు ఔచిత్యాన్నందించి 
భువిలోని జనులందరికీ ఆదర్శంగా నిలపాలన్న
కోరికతో అలా ఇతివృత్తాలను స్వీకరించి యుండనోపు.



రాజాశ్రయంకోరి కొందరు రాణీప్రేమపురాణాలకు
ఔచిత్యాన్నాపాదించి వారిముఖస్తుతిని కావ్యాలుగామలచి
శృంగార రసగంగాధరులుగా వారి జీవితాలను
రసమయంజేసే రామణీయార్ధంకోసం
గజారోహణాల గ్రాహకంగా మార్చుకోడానికో
ప్రబంధాలను ప్రకృష్ట పదబంధాలుగా
తీర్చిదిద్దుతూ రచనలు సాగించి క్షీణ ప్రబంధయుగానికి
మెరుగులు దిద్దో నాందీ వచనాలు పలికో వుండి వుండవచ్చును.


కవులెందుకు కావ్యాలను వెలువరిస్తారో అవగతమవదు

ఊహల్లో విహరించే ప్రేయసిని ఉన్నత శిఖరాలకధిరో హింపజేసే
సదుద్దేశంతో ప్రణయ కవితా మహాసంద్రాల్లో మునిగితేలుతూ

లలిత లలితమైన పదబంధాలతో భావగీతాలను గిలికి
ఆధునిక కాలంలో అల్లకల్లోలంగా మారిని జన హృదయాలను
మరో లా మనసును చల్లబరిచే భావనా స్రవంతికి

ఏతమెత్తే సద్భావనా విలసితంగా కావ్య సంపుటులను
వెలికిదెచ్చి వేదనాతరంగాలకు కొంతమేర ఉపశమనం కలిగించి ఉండవచ్చును.

కవులెందుకు ప్రగతిశీలమైన కవితలతో అధోజగత్తులో
అట్టడుగున వెంపర్లాడుతూ అలంటించే వారికి ఉపశమనం కలిగిస్తూ
కడుపునింపుకుని అల్లకల్లోలాలను సృష్టిస్తూ ప్రగతిరధాన్ని
తిరోగమనం పాలుజేయాలన్న వారి తిక్కనడంగించడానికీ
కడుపు మండిన వారికి సాంత్వన చేకూర్చేలా సమసామాజనిర్మాణమే
లక్ష్యంగా మరోప్రపంచపు ధగద్ధగలను సామాన్యుడికీ
పరిచయంచేయాలన్న తపనతోనూ మహాప్రస్థానం వైపు
వారి వారి మనసులను మళ్ళించే దివ్య భావనతో ఉత్తేజపరిచే
కవితలతో ఉద్యమ స్ఫూర్తికి భంగం వాటిల్లకుందా
ప్రబోధగీతాలనూ ప్రచార ధోరణిలో వెలువరించి ఉందనోపు.

స్మాతంత్ర్యం సముపార్జన ధ్యేయంగా స్వార్ధాన్నీ సంకుచితత్వాన్ని
కాలరాచుకుంటూ రాష్ట్రావతరణకోసం ప్రత్యేక భావాలను
సముపార్జించే ప్రబోధలక్ష్యాలతో కవితలను ఉత్తేజపరుస్తూ
వెలువరించి తమ గమ్యంకు  ప్రజలను చేర్చే దిశగా ప్రయత్నిస్తూ
గీతాలను జనహృదయాలకు హత్తుకుని వారి లఖ్యం నెరవేరెందుకు
రచనలను ఆధునిక భావాలకనుగుణంగా మలచుకుంటూ రచనలు చేసి వుండవచ్చును.

No comments:

Post a Comment