Wednesday, March 18, 2015

వసంతంలా-వాకిలిముందుకు నడచివచ్చే--
===========================
తలబోడేమోగాని
తలపులు బోడులుగానెకావు.

నిన్నటిదాకా మ్రోడు వారిన రూపంతో
మొహం మొత్తిన తరుసంపదంతా
నూత్న మర్యాదను చేజిక్కించుకుని
గాలులు వీచే దిశనుకనిపెడుతూ
శిర: కంపనలు మొదలెడుతున్న
శుభ ఘడియల సుముహూర్తవేళలు.

 నాలుగునెలలపాటుమృగ్యమైన మొహాలన్నీ
కొత్త చొక్కా  తొడుక్కున్న కుర్రాళ్ళలా
కొంగ్రొత్త చివుళ్ళతో కళకళ లాడిపోతున్నాయ్.

నిన్నటిదాక ఐపులేకుండా జాడకూడా కాన రాకుండా
 యే వల్మీకంలోకో వె ళ్ళాయనుకున్న 
విహంగాలన్నీ మూకుమ్మడిగా చెట్లపైకిజేరి
సామూహికంగా సభా మర్యాదలను పాటిస్తూ
సమావేశమయి,   పరస్పర సహకారాన్నందించుకుంటూ
హరిత శోభతో పరిసరాలనన్నింటినీ అలంకరిచుకుంటున్నాయ్.

ఇంకా పొద్దెక్కి చాలా సేపయినా కార్యాలయాలకు
వడివడిగా వెళుతూ వినిపించడమ్మొదలవని కారు కూతలు.

బద్ధకంగా మేఘాల  నులివెచ్చని కౌగిళ్ళలను వదిలించుకుని
అరుణారుణ రేఖలతో ఉదయించక తప్పదా!! అనుకుంటూ
నేను ప్రవేశిస్తున్నానహో అంటూ  రకరకాల శ బ్డాలు వినిపించగానే
ఉలిక్కిపాటుతో వినిపించే సుప్రభాత గీతాల సంగతులు.

ముందుగా నా రాకను పసిగట్టయేమోమరి
ఇంటిపెరట్లో పూసేస్తున్న సుమపరిమళ సుమగంధాలు.
నాదాకా వచ్చి తమనునులేత  లతలతో పులకింపజేయాలని
తహతహ పడుతున్న దాఖలాలు సుపష్టంగా కనుపిస్తున్నాయ్..

పశువుల కొష్టంలోనుంచి 'మాకు దాణా వెయ్యండిరో' అంటూ
ఆపశులగణం పెడుతున్న ఆకలి కేకల పరంపరలు.
ఇదంతా రాబోయే వసంతునికినేపధ్యమై
అనేవిధంగా' అందచందాల రాణీ' ఆ ఆమని అన్నట్లుగా అలరారుతున్నది.
===================================================

No comments:

Post a Comment