Monday, March 2, 2015

అవసాన దశ సాన్నిహిత్యంలో--
                                    ----రావెల పురుషోత్తమ రావు.
-------------------------------------------------------------

వృద్ధాప్యం గట్టిగా నిన్ను వాటేసుకుని
వదలను పొమ్మంటుంటే నువ్వు కించపడనక్కర్లేదు.
నీ నేత్రాలు నిమీలితమై క్రిందికి వాలిపోతున్నప్పుడు
నీకు నచ్చిన నీవు హృదయ పూర్వకంగా మెచ్చిన
ఓ కవితాసంపుటుని రెండు చేతులనిండా దొరకబుచ్చుకో
ఆ పుస్తకంలో ఇత: పూర్వం నీకు నచ్చిన నీవు మెచ్చుకున్న
వాక్యాలను పదే పదే వల్లించడం అలవాటుజేసుకో.

అప్పటిరోజుల్లో నీ కవితా హృదయాన్ని మెచ్చుకున్న
అనవసరంగానో అసంకల్పితంగానో నీ వ్యాసంగాన్ని
నొచ్చుకున్న వారినీ ఒక్క సారి గమనంలోకి తెచ్చుకో.

మెచ్చుకున్న వారినీ నొప్పించిన వారినీ సమదృష్టితో
వినమ్రంగా,వినయ విధేయతలతో మననం జేసుకో
నిన్ను ప్రేమించినవారందరందరూ నిన్ను ముఖప్రీతిగా
స్తుతించనక్కర్లేదని తెలుసుకో--నిన్ను గౌరవించలేనివారైనా
నిన్ను ప్రత్యక్షంగా విమర్శించవలసిన అవసరమూ లేదు.

పుస్తక ప్రేమికుడిగా వాళ్ళిద్దరినీ సమానమైన అనురాగంతో
స్వీకరించగలిగిన సహృదయాన్ని నీకందించిన పుస్తకాలను గౌరవించు.
నీ ప్రేమకు నిర్వచనాన్నందించిన గ్రంధాలకు నమస్కరించు.

ఒక్కోసారి నీ ఈ అభిమానమే నీకు తెలియకుండానే నీతో చెప్పా పెట్టకుండా
ఎక్కడికో దూర దూర తీరాలకు చిత్తగించిన సంఘటనలూ
 ఎదురవవచ్చు ముందు ముందు. అవి అలా పరుగెట్టికెళ్ళి పర్వతసానువులపై ఏకాంతాన్నాశ్రయించి ఆకాశపధంలోనితారాగణాన్నంతటినీ
నిశితంగా పరిశీలిస్తూ నీవైపే నిలబెట్టిన సారించిన  క్షణాలను
అనురాగామృత స్పర్శతో ఆలోచనామృతంగా భావించు.

తారలవైపు నీవు చూస్తూ అవి ఇలా వచ్చేస్తే నువ్వెంతగా విలపించావో
వివరంగా నీ సణుగులతో చెప్పి గుండెను తేలిక పరుచుకో----
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^2-3-15

No comments:

Post a Comment