Tuesday, March 17, 2015

కాశీ యాత్ర
-------------
ఉదయాన్నే నిద్రలేచి
కాశీలోని గంగవొడ్దుకు
గబగబా చేరుకున్నాను.
అప్పటికే దహన వాటికలన్నీ
అంతిమ సంస్కారానికి సిద్ధమయిన
ప్రేతాత్మలన్నీ కట్టెలపైపేర్చబడి
అనంతవాయువుల్లో కలవడానికి
త్వరపడుతున్నాయనిపిస్తున్నాయ్.

అప్పటికే కొన్ని వాటికల్లో
పైకెగసిపడుతున్న అగ్ని జ్వాలనుంచి
పొగలు ధూమ కేతువుల్లా

 నింగి బాట పట్టాయ్.

దూరంగా ఓ మహిళ నీటిలో
పవిత్ర స్నానమాచరించడానికి
సిద్ధమయిన రీతిలో కనబడుతోంది.
ముందస్తుగా తన రెండుచేతుల్లోనూ నిండుగా
నీళ్ళను తీసుకుని నెత్తిపై జల్లుకుంటున్నది.

ఇంటిదగ్గరనుంచి తనతో తెచ్చుకున్న లోహపాత్రను
గంగా జల ప్రవాహంలోముంచి నిండానీటినినింపుకుని
ఇంటికి తీసుకెళ్ళడానికని వొడ్దుకెక్కడానికి తయారవుతున్నది.
ఇంటిదగ్గరనున్న శివలింగాన్ని ఈ జలంతో బహుశా
అభిషేకించాలని గట్టి పట్టుదలతో ఉన్నట్లుగా తోస్తున్నది.

దూరంగా బిస్మిల్లా ఖాన్ గారి సహనాయ్ వాద్యం నుంచి
శ్రవణపేయమైన సంగీతం వీనులవిందుగా వినిపిస్తున్నది.
 ఆ సంగీత శబ్ద తరంగాలు గుడిలోని స్వామి విగ్రహందాకా
చేరుకున్నట్లు గాలిగోపురంపై తిష్టవేసియున్న  పావురాండ్ర 
శిరో కంపనం ద్వారా విదితమౌతూనే వున్నది.
ఇదీ ఇప్పటిదాకా నేనీ పవిత్ర యాత్రా స్థలంలో నేను తిలకించిన దృశ్యమాలిక. వీటిని నామనో నేత్రంపై అనూదితం చేసుకుని
తిరిగి నేను మా విదేశంలోని స్వగృహంచేరే దాకా భద్రపరుచుకోవాలి.వీటిని యధాతధంగా 
మార్పులూ, కూర్పులూ చేరకుండా సంపుటీకరించమని
 ఆ భగవంతుడిని మనసారా ప్రార్ధించాలి.
=====================================
  Mary Oliver కవితకు అక్షరసహగాని, యధాతథం- కాని స్వేచ్చ అనువాదం]
-------------------------------------------------------------------------------------------------

No comments:

Post a Comment