Friday, March 27, 2015

ఇంక సెలవు
-----------------రావెల పురుషోత్తమరావు.

ఊరు ఊరునూ అమ్మేసుకుంటున్న జనులారా!
ఇక మీరంతా నాకు కన్నీటివీడ్కోలు పలకడానికి
తండోప తండాలుగా తరలి రండి.

ఇప్పటిదాకా మీ ఉచ్చ్వాస నిశ్వాసాలకు
ఊపిరినై ఉండిపోవాలని ఇక్కడనిలబడిపోయా!!
మీఇంటికి పసుపూకుంకుమలను నేనే నై
పదికాలాలపాటు సుమంగళినై దీవించా!

ఇక నా అవసరం మీకు  తీరిందనే నేను అక్షరాలా నమ్ముతున్నా
మీకూ నాకు ఇక ఋణం చెల్లిపొయిందనే ప్రగాఢంగా విస్వసిస్తున్నా!

రాజధాని నిర్మాణంకోసం నన్ను కృత ఘ్నతా భావంతో అమ్మడం
కళ్ళారా వీక్షించా! ఇంత తొందరగా నాతో అనుబంధాన్ని ఇలా
పుటుక్కున తెంచేస్తారని ఊహించలేక పోయా!
ఈ అనూహ్యంగా మీరు తలపెట్టిన అకృత్యాన్ని
నా కనులతో నేను చూడలేక కన్నీళ్ల పర్యంతమై
దిగాలు మొహంతో దీనంగా తరలిపోతున్నా!!

ముసలాళ్లు మంచాన పడినప్పుడు వైద్యుడికన్నా మిన్నగా
నేనున్నాననులెమ్మని మీకు భరోసా చెప్పగలిగా!
అమ్మాయిల పెళ్లిళ్ళకూ అబ్బాయిల చదువులకూ
అండగానేనుంటానని హామీలనిచ్చి మరీ ఆదుకున్నా.



పైరు జొంపాలమీదనుంచి వీచే మలయ  మారుతాలనన్నింటినీ
మీ ఇంటి వైపు వీచేలా చూసి మీరు గుండెలమీద
చేతులు వేసుకుని హాయిగా నిద్రించడానికి ఇతోధికంగా
నా వంతు సాయాన్ని నేను నెరవెర్చాననే భావిస్తున్నాను.

అయినా మీకు నాపైన ఉన్న ప్రేమకన్నా నయవంచకులైన
నేతల  వాగ్దానాల మూటలమీదనే నమ్మకమున్నదని గ్రహించా!
నా సమాధిమందిరాలమీద శాశ్వతమైన రాతికట్టడాలమీదనే
మీకు మోజు పడిందని గ్రహించడానికి నాకు ఇట్టే సమయం పట్టలేదు.

ఇకమీకూ నాకూ మధ్యన అనుభూతుల అంతరాయం యేర్పడిందని తెలుసుకుని   ఇప్పటిదాకా నన్ను ఇంతగా ఆదరించిన మీఅందరికీ చింతనామృతమైన చిత్తంతో పేరు పేరునా
మీకు ధన్య వాదాలు చెపుతూ శాశ్వతంగా ఇక సెలవు తీసుకుంటున్నా!
===============================================



No comments:

Post a Comment