Friday, March 13, 2015

చందన స్పర్శ
=================
నిన్నటిదాకా ఎండిపోయి
దివాలాతీసిన అవతారంతో
దిష్టిబొమ్మల్లా నిలబడ్డ
తరువులన్నింటికీ తరుణ స్పర్శ.

గడ్డగట్టి ఘనీభవించి
పారలేను పొమ్మన్న యేరులన్నీ
పరవశాన ప్రవహించే తీరు
నయనానందకారకం.

యేచిత్రకారుడో చెమటోడ్చి
కుంచెలద్దిన వర్ణచిత్రంలా
యావద్ ప్రకృతీ యవ్వనోత్సాహంతో
జవనాశ్వలా ఉరకలు బెడుతున్న తీరు
నయగారాలు బోతున్న నవమన్మధునికి  
పచ్చని తివాసీ మీద నడచిరమ్మని
హృదయమనే కోవిల పాడుతున్న
మోహనరాగంలా వినబడితే  
ఈ జన్మ కిది చాలనుకోవడం 
అభినందన చందన
 పురస్కారమందుకో వడం కాదంటారా?
===========================

No comments:

Post a Comment