Monday, March 30, 2015

ఓ గరుద పక్షి తన పాదబంధంతో
ఓ సరీసృపాన్ని ఈడ్చుకెల్తున్నది.

కర్బనపు వాయువూ నీలలోహిత కిరణాలూ
కొన్ని దోమలూ, అన్నింటినీ తన హృదయకుహరాల్లో
దాచుకుని గగనం తన భుజాలనెగరేసుకుని
నిరాడంబరంగా నిమ్నోన్నతాలను కుదుపుతూ
తన విజయ యాత్రను కొనసాగిస్తుంది.

ఆకాశానికి ఎందుకోమరి వయసుమీదబడుతున్నదన్న
చింతయేమీ ఉన్నట్లు కనబడడంలేదు.
మతిమరుపన్న మాటనే దగ్గరకు చేరనివ్వడంలేదు.

ప్రతి [రభాతానికి కావాల్సిన రంగవల్లులనన్నింటినీ
తనే స్వయంగా తీర్చిదిద్దిపెడుతున్నది.
అనూహ్యమైన సంతసమంతా తనకె స్వంతమని భావిస్తుంటుంది.

సునామీలుగానీ సుడిగాలులుగానే భయంకరమైన
ఉరుములూ మెరుపులూ దాన్ని జంకించలేకపోయాయి.
వడగండ్ల వానలు దానికేం కడగంద్లను కొనితెచ్చిపెట్తిన దాఖలాలేదు.
మంచుతెరలడ్డొచ్చి ఎన్ని అవాతరాలను కలిగించినా
తన ధీరత్వాన్ని కోల్పోయిన సూచనలు కానరావడంలేదు.
ఉదయాన్నే ప్రతి ఇంటిలో కిటికీ తెరవగానే ఉషస్సులను
వరుసగా సరఫరాజేస్తూ విసుగూ విరామంలేకుండా
సంధ్యాసమయందాకా శ్రమిస్తూనేకనబడుతుండి.
గగనం ఎప్పుడూ సాదృశంగా నిర్మలాకారంలోనే ప్రత్యక్షమౌతుంది.
అద్దంలో తన వదనారవిందాన్ని చూసుకోవాలని తాపత్రయం పడదు.
మబ్బులతో అప్పుడప్పుడూ మసకబారినట్లు కనిపించినా దిగాలుగా
ఎప్పుడూ సాక్షాత్కరించిన ఆనవాలు అస్సలేమీ లేదు.

మనం ఆ నీలిగమనపు నిశ్చలత్వాన్ని చాలా నేర్చుకోవాలేమో మరి!
ఎప్పుడూ కొండాకొనలను స్పృశింఛి చుంబించినా ఎగిరెగిరిపడదు.
సముద్రంలో తన ప్రతిబింబం కనబడినా తన వైశద్యాన్ని తగ్గించుకోదు.
రాత్రంతా చందమామతో కధలు చెప్పుకుంటూ సరద సరదాగా  కాలక్షేపం చేస్తుంది.

గ్రహణాలబాధనూ పెద్దగా పట్టించుకున్నట్లు అనిపించదు.

అందుకే ప్రతి మనిషీ అంతో ఇంతో ఆకాశాన్ని జూసి సమ్యమనపాఠాలు చెప్పించుకోవాలి.

No comments:

Post a Comment