Friday, March 6, 2015

పెద్ద బాల శిక్ష--
--------------రావెలపురుషోత్తమ రావు.
్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్
ఎంత ఉద్ధృతగతిలో ప్రవహించే జలనిధియైనా
మలుపు దగ్గరకొచ్చేసరికి వేగం తగ్గింపక తప్పదు.
ఎంత ఉన్నత శిఖరాలనధిరోహించిన మనిషైనా
అనురాగ వతియైన భార్యామణి  సందర్భోచితపు
సలహాకు సరేనని తలవూచక తప్పదు.

ఎంతటి  ధైర్య వంతురాయిన ధీర వనితనాయికయినా
నాయకోత్తముడి వెంట  బేలవోలె పార్కులవెంట పరుగులిడక తప్పదు

ఎంతటి పేర్వడసిన నాయకుడయినా  ఎన్నికల సమయానికి
తన పేరుబలాలను ప్రజలముందు పరీక్షించుకోక తప్పదు.

ఎంట మనోహరమైన గాయకుడాయినా శ్రోతల మనోభీష్టానికి
అనుగుణoగా తన పాటల పల్లవులను సవరించుకోక ససేమిరా తప్పదు.
 ఎంతటి ప్రసిద్ధుడయిన నేటి  కవయినా ఇవ్వాల్టి  తన మూలాలకు
పూర్వం తనముందు తరంకవుల కావ్యపఠనపు  చలువేనని సహృదయంతో ఒప్పుకోక తప్పదు.
మనిషి మనిషిగా మనగలగడానికి ముందుతరంవారు
మనకు నేర్పించిన శ్రద్ధా బుద్ధులేననిప్రతిమనిషీ అంగీకరించక తప్పదు.
*******************************************6-3-15

No comments:

Post a Comment