Thursday, March 26, 2015

వానొచ్చినప్పుడు
-------------------

చిన్నప్పుడు స్కూలుముందర వాగు
వానొచ్చినప్పుడలా వరద గోదావరిని
గుర్తుకు తెచ్చి భయకంపితంచేసేది.

ఊరు ముమదరచెరువులో గంగబండను తాకుతూ
నీరొచ్చినప్పుడలా ఊరు వూరంతా
చెరువుగట్టుమీదజేరి దిగాలుముఖాల్తో
గంగబండనుదాటి నీరు ప్రవహించకుండా
 చూడమని ఇష్ట దేవతలందరికీ
ప్రార్ధనల పరంపర కొనసాగుతూ వుండేది.

పొలాల గట్లమీద పహరాకాస్తూ
రైతన్నలంతా బోదె కాలువలు నిరంతరం
సాగుతూ పారేలా చర్యలను చేపట్టేది.

వరిపొలాల్లోనీళ్ళునిలబడక పోతే పైరుకు నష్టమని
నీరు బయటకు మరలిపోకుండా జాగ్రత్త వహించేది.

వాన వెలసిందని తెలియగానే ఊరు ఊరంతా , ఊపిరిపీల్చుకుని
రాత్రిజాగారంచేసినందుకు పగలంతా నిద్రలో మునిగితేలేది.
=========================================

No comments:

Post a Comment