Sunday, March 8, 2015

ఆవిడెవరైతేనేం-----     రావెల పురుషోత్తమరావు.
==============
{అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకుని]
ఆవిడెవరైతేనేం
ఆత్మీయ స్పర్శానుభూతికి
కరిగి ప్రవహించే నదిలా
అమర గలిగి నప్పుడు.

ఆవిడెవరైతేనేం
గుండె చుట్టూ అలముకున్న
గాఢాంధకారాన్ని తరిమే
దీపమై వెలగ గలిగినపుడు.

ఆవిడెవరైతేనేం ఆకలిగొన్న శిశువుకు
కడుపునిండా స్తన్యమందించి
క్షీరాన్ని గ్రోలే
అవకాశాన్నందించ గలిగినప్పుడు.

ఆవిడేవరయితేనేం అక్షరాభ్యాసం నుండీ
ఉద్యోగం అందిపుచ్చుకునేదాకా
తన స్వేదంతో స్నేహఫలాలనందిం చగలిగినప్పుడు.

ఆవిడెవరయితేనేం అన్ని వేళలా తనసుఖాలను త్యజించి
పరోపకారంకోసంపాటు పడాలని పరితపించ  నుంకుంచినప్పుడు.

ఆవిడెవరయితేనేం సరిహద్దుల్లో శతృమూకలను తరిమిగొట్టేందుకు
తనసంతానాన్ని ఒకరొకరినీ వీరతిలకం దిద్ది సంగ్రామానికి
సన్నిహితంగా సాగనంపగల వీర వనితగా సాహసించగలప్పుడు.

ఆవిడెవరైతే ఒడిలోతలపెట్టుకోగానే సానుతాపంతో
సహధర్మ చారిణిగా కష్టసుఖాలలో తోడూ నీడగా
ఏడడుగులు వేసినదానికి సోదాహరణంగా నిలిచి ఎదకుహత్తుకుని
ఎక్కడోలేదు స్వర్గం తన సాన్నిధ్యంలోనే సాగిలబడివున్నదని
ఋజువు పరచగలిగినప్పుడు.
+++++++++++++++++++++++++++++++++8-3-15

No comments:

Post a Comment