Monday, March 23, 2015

సుభాషితం అదే సజ్జనసమ్మతం--
------------------రావెల పురుషోత్తమ రావు.
------------------------------------------

ఆకులు రాలిపోవడంఖాయమేనని
శిశిరం చెవిదగ్గర గూడుకట్టుకుని
మరీ విన్నవిస్తున్నది.అలాగని
అర్ధాంతరంగా ఆ చెట్టుకున్న కొమ్మ
నంటిపెట్టుకున్న పట్టును ఇట్టే వీడలేదుగదా!

వృద్ధాప్యం ఒక శాపమని తెలుసు
అలాగని ఆ ఘడియ సమీపించేదాకా
చూరు పట్టుకు  వ్రేలాడే గబ్బిలంలా
ఇంటి పట్టున విశ్రాంతి తీసుకోక తప్పదుగదా!!

ఆరు రుచులలొనూ అత్యంత బాధాకరమైనది
చేదు వగగరులన్న విషయం  అందరెరిగినదే
అలాగని అహరహమూ ఆరెండురుచులనూ నెమరేస్తూ

కాలం గడపలేంగదా! అప్పుడప్పుడూ తీపిని రుచిచూపించమని
నాలుక అడుగుతూండడం అసహజమేం కాదనిపిస్తున్నది.

జీవితంలోనవరసనాట్యం తప్పదని తెలిసి నడచుకోగలగడమే
మానవునుని ప్రజ్ఞా పాటవాలకు సరయిన పరీక్షసుమా!

చీకటివెలుగుల చిత్రమైన కలబోత మనిషిజన్మమని
గ్రహించగలిగిన నాడే మృత్యువునినా ధైర్యంగా రారమ్మని
ఆహ్వానించగల సత్తా యేమనిషికయినా అసంకల్పితంగా 
ఒనగూడుతుందనే యే శాస్త్రమైనా వల్లె వేసి ఉదాహరిస్తుంది.
======================================







No comments:

Post a Comment