Friday, March 6, 2015

స్మృత్యంజలి
============
అవును నువ్వన్నట్లు అతను వృత్తిపరంగా
పరమ కిరాతకమైన
రక్త , మాంసాలతో వాణిజ్యంచేస్తూ
పొట్టనింపుకునే కసాయివాడే కాదనను.
కానీ అతను నీకన్నా , నాకన్నా గూడా
నిర్మలహృదయుడన్న విషయం మాత్రం
 మనమెప్పుడూ  మరువకూడదు.

మన ఊహలకతీతంగా అతను భార్యను
గుండె గొంతుక నిండుగా ప్రేమిస్తుంటాడు.
ఆమే ఇక బ్రదకదని వైద్యులు నిర్ధారించినప్పుడు
అతను రాత్రంతా గుండెను చెరువుచేసుకుని
యేడుస్తూనే వున్నాడు.చిన్నపిల్లలకన్నా
హీనంగా కన్నీరు మున్నీరుగా   విలపిస్తూనే వున్నాడు.
ఆవిడతని బాధను గమనించి అతన్ని అల్లుకుపోయి
నిన్ను వదలివెళ్ళలేను పొమ్మంటూ కళ్ళలోనే అతనికి జవాబుచెప్పేసింది.

అంతగా అన్యోన్యమైన దాంపత్యం వారిది.ఇతరులెవరికైనా
అసూయపుట్టించేటంత అనురాగ, ఆత్మీయ బంధం వారిద్దరిదీ!

ఆమె చిట్ట చివరకు ఆఖరు శ్వాసను వదిలేసాక.
ఈ ప్రపంచమంతా శూన్య స్థావరమేనని భావించాడు అతను.

ఆవిడ ఇష్టంగా అల్లుకుని అపురూపంగా దాచుకున్న అన్నిఊలు దారాల
 వస్తువులనూ అత్యంత భద్రంగా ఓ చెక్క పెట్టెలో భద్రంగా పదిల పరచి
అందులో ఆమే కిష్టమైన విరజాజిపూల మాలను ఆమే స్మృతిచిహ్నంగా
అందులోనే దాచిపెట్టి దాన్ని ఇంట్లో  ఒ గదిలో  జాగ్రత్తగా దాచిపెట్టి
 ఆమె మరణయాత్రలో పాల్గొన్న కళాకారులకూ  వాద్యసహకారాన్నం దిచిన అందరికీ

అణాపైసలతో సహా లెక్కగట్టి డబ్బులన్నింటినీ ఒక్క సారిగా  చెల్లించి
కసాయిదుకాణాన్ని ఒక్క తృటిలోమూసేసి ఆమె దివ్య స్మృతులలొ
కాలం గడూపుతూ ధన్యజీవిగా చరిత్రపుటల్లో సువర్ణాక్షరాలతో
గణుతించబడి కీర్తిశేషుడై మిగిలిపోయాడు.
----------------------------------------------
[ఓ ఆంగ్ల కవిత ఆధారంగా]

No comments:

Post a Comment