Monday, March 2, 2015

క్షీరాబ్ధి కన్యకకు---
-----------------------
అప్పుడే మజ్జిగను చిలికి వెన్నను తీసిన
తర్వాత మజ్జిగపై పేరుకున్న
వెన్నతొలికలను ఊరంతా
విస్తారంగా చల్లినట్లు
పొడి పొడిగా కురిసిన
తుహిన సౌందర్యం.

ఆ భానయ్య గ్రీష్మ
కిరణాల నులివెచ్చని
కౌగిలిలో నలిగి కరుగకముందే
మనం ఈ మంచు కురిసిన నేలను
వడి వడిగా వీక్షించాలి.

తయారు చేస్తుండగానే నడిమయాన
విరిగిన పాలకోవా ముక్కలను
విసురుగా బయటకు విసిరేసినట్లు
పలు శకలాలుగా విస్తరించిన
తుహిన సౌందర్యాన్ని
వేసవి కాలపు మన్మధుడు తన బాణాలతో
కొల్ల గొట్టకముందే
గబగబా బయటకు వెళ్ళి
వీక్షించి రావాలి.

కాచే పాలు విరిగి ముక్కలై
నేలబారుగా పొంగి ప్రవహించి
పేరుకు పోయినట్లు
హిమ శీతల సౌందర్యం
సూర్య భగవానుడి కవోష్ణపు కౌగిలిలో
కరిగి నీరవకముందే
పిల్లలు తుహిన బాలుడిని
తయారుచేసే దిశలో
పడిన మంచునంతా చిందర వందరగా
చెల్లా చెదరు చేయకముందే
ఈ శ్వేత రంగవల్లిని
నేత్రానందంగా చూసి రావాలి.

ఈ తుహినమంతా క్షీణించే ఉష్ణోగ్రతలకు
గట్టి పడుతూ గాజుపలకలా పరిణమినకముండే
ఈ హిమగిరి సొగసులను వీక్షించి రావాలి.

[దాదాపు ముప్ఫదేళ్ళ తర్వా 10  సెంటీ మీటర్ల మంచు ఇక్కడ పడిందని తెలిసాక
ఆ హిమ సౌందర్యాన్ని కన్నులపండుగగా వీక్షించిన మధుర క్షణాలకు పేఅవశుడనై

పులకించిపోతూ ]

No comments:

Post a Comment