Thursday, March 5, 2015

ఉష్ణోగ్రతా ,నీవెంత ఉద్రేకివో గ్రహించావా?
వేసవి వాకిట్ళ్ఫ్ కడుగుపెట్టగానే వేడిమితో
జనాన్ని అలల్లాడింపజేసి ఉజ్జిరి బిక్కిరిజేసి
వీరభద్రుడి అవతారన్లోలా వీరంగాలేయిస్తావ్
అందరినీ స్వేద సంద్రంలో ముంచెత్తించి చిరాకు పెట్టిస్తావ్!
ఉగాదినాటి వూసులన్న్నింటినీ మరచిపోయి ఉఫ్ఫ్ మనిపించే
కెంద్రంలా ఉపయోగకారిలా కాకుండా ఉస్సురుస్సురనిపిస్తావ్!!

ఆతరాతి వానాకాలంలో అందరినీ అకాల వర్షాలతో
ఆదరా బాదరా హడావుడిగా పరుగులుబెట్టిస్తావ్
గాలి వానలతోనో సుడిగాలుల సునామీ గా ంస్స్రిపోయి
కళ్ళాళో పంటనారబోసుకున్న రైతుల కనులవెంట
నదులను ప్రవహింపజేస్తావ్-- చెట్లకూమూక్కలకూ
జీవనాధారమై చైతన్య దీపాలను వెలిగిస్తావ్!

హేమంత ఋతువులో నీ స్థాయిని తగ్గించుకుని
ప్రజావళికి వణుకును బుట్టిస్తావ్
నులివెచ్చదనపు కౌగిళ్ళలో దాంపత్య సోభకు రంగుల్సద్దుతావ్!

శరత్కాలంలో పిండారబోసిన వెన్నెలవై-- మన్మధ సామ్రాజ్యానికి
మరో ప్రతినిధివై జనం హృదయాల్లో ప్రేమానునురాగాలను  హెచ్చిస్తూ
ప్రణయ దుందుభులను మ్రోగిస్తూ నిరంతరం యుగళ గీతాలతో ఇంటింటా
నినదిస్తూ నీరాజనాల నందుకుంటావ్!
----------------------------------------------------------

No comments:

Post a Comment