Monday, March 23, 2015

ఆఖరి క్షణాలకత్యంత సమీపంగా--------
=====================

అది రాక్షస వ్రణాలను నయంజేసే  వార్డు.
అందరూ క్షతగాత్రుల్లా స్రుక్కి సోలి పొతూ
నిస్త్రాణగా మంచాల కతుక్కుని
ముక్కుల్లో మొహాల్లో త్యూబులతో
రణరంగానికి సిద్ధమైన
వీర సైనికుల్లా ఆశలను శ్వాసిస్తూ
నరనరాల్లో నెత్తురు బొట్లు జారిపడుతుండగా
అందరినీ ఆందోళనా పధంలోకి నెట్టేస్తున్నారు.

వైద్యులూ నర్సులూ నెమ్మది నెమ్మదిగా వాళ్ళకు
సేవలనందిస్తూ రోగులు ప్రశాంతంగా ఉండేలా చూసుకుంటున్నారు.
ఇంతలో ఒకా విడకు గుండె వేగం తగ్గిందని గబ గబా
ఆత్యయిక స్థితిని సూచించే గదిలోకి హడావిడిగా మార్చేసారు.

ఆమె మాత్రం అచేతనావస్థలోకి
వెళ్ళిన దాఖలా స్పష్టంగా కనబడుతున్నది.
నాలుగ్గంటల తర్వాతగానీ యే విషయం చెప్పలేమని
ఆమె కు వైద్యం చేస్తున్న వైద్యులు
వివరించి బంధువులకు చెప్పారు.

అందరిగుండెల్లోనూ జపాన్ రైళ్ళు పరుగెట్టడం మొదలయింది.
నాలుగో గంట సమీపించేసరికి మొహాలు వేలాడేసుకుని
వైద్యులూ, నర్సులూ ఆ గదిలోంచి గబ గబా బయటకొచ్చేసారు.
కళ్ళు తుడుచుకుంటూ బందువులు, వెక్కి వెక్కి ఏడుస్తూ వాళ్ళాయన
ఆమె మాత్రం , ఆరోజు ప్రశాంతంగా శాశ్వతలోకాలకు పయనమైపోతూoది.
అతనిచేతిలోంచి అమృతంకురిసినరాత్రి అసురసంధ్య వేళకే
ప్రక్కకు వాలి, నేలబారుకు క్రిoదకు జారి పడిపోయింది.
=====================================



No comments:

Post a Comment