Wednesday, March 11, 2015

నావుడు అనవుడు---
================రావెలపురుషోత్తమరావు.

జీవన వైవిధ్యపు 

మనసు మూగదయేదాకా
మాటాడని యవ్వనం
దివినుంచి దివికి
జారిపడ్డ దివ్య 
సుందర సుమగంధంలా లావణ్యం.
అనాఘ్రాత పుష్పమేమో అనుకున్నరేమో 
దీపనిర్వాణ గంధమనుకుని
ఎవ్వరూ మూర్కొన్న దాఖలాలేదు.

పట్టపగలే పౌరోహితులవారు
నింగివైపు దృష్టిని సారిస్తూ
అగపదిందిగదా అన్నప్పుడు
అంధ పాంధుడిలా ఔనన్న
అబద్ధపు పెళ్ళికొడుకులా
జీవితాంత కననోపని

దాంపత్య  వీణపు సుమధుర
సుమనోహర సప్త రాగ సుస్వరాలు.

హితం ఎవ్వరు చెవిదగ్గర ఇల్లుగట్టుకుచెప్పినా
సరిగ్గా చెవికెక్కని జీవన వేదాంతపు
సులభ గ్రాహ్యమైన మిత్ర వాక్య
 పరంపరలూన్నీ కలగా పులగంగా
 అస్తవ్యస్తమై అలరారుతూ
చిగురించడానికి సిద్ధమౌతున్న చిలిపి ఆలోచనలు.

పంచతంత్రపు సూక్తికి సన్నిహితంగా
పరాచికానికి కూడా మింగుడుపడని
అనవుడు దానవుడుల అరణ్య రోదనలు.
-----------------------------------------------------------11=3-15

No comments:

Post a Comment