Monday, March 30, 2015

ఎందుకో నాకు చిన్నప్పటినుంచీ పద్య నాటకాలంటే బహు ప్రేమ.ఊరిలోనయునా ప్రక్కనున్న ఊర్లలోనయినా నాటకం వేస్తున్నారంటే స్కూలు దగ్గరనుండిరాగానే తయారయి వుండే  వాళ్ళం. అందునా ఆరోజుల్లో రవాణా సౌకర్యాలు ఇప్పటిలా
లేవుగనుక ఎడ్లబండిగట్టుకుని వెళ్ళే వాళ్ళం.నాతోపాటు ఇప్పుడు డాక్టరయిన మధుసూదనుడు  తొడయే వాడు.బండి జల్లలోనో ముందు తొట్టిలోనో దుప్పటికప్పుకుని దాక్కునే వాళ్లం. బండి కొంతదూరం వెళ్ళాక మమ్మల్నుగమనించినా ఇంకచేసేదేంలేదుగనుక ఊరుకునే వాళ్లు పోనీలెమ్మని.ముఖ్యంగా మాకు సత్య హరిశ్చంద్ర నాటకమంటే
చచ్చేంత అభిమానం. అందులోముఖ్యంగా కొన్నిపద్యాలు మమ్మల్ను బాగా ఆకర్షించేవి మొదటగా తిరమై సంపదలెల్ల  రెండోది
మాయామేయజగంబు--మూడోది, దళమౌ పయ్యెదలోనడంగియును-- ఇవిగాక కాటిసీనులోని జాషువా గారి పద్యాలు బాగా కదిలించేవి.
ముఖ్యంగా నక్షత్రకుడిగా పులిపాటి వెంకటేశ్వర్లు గారు,తమ్ముడు [లక్ష్మీ నారాయణని గుర్తు] వేస్తుంటే విశ్వామిత్రునిగా మందపాటి రామలింగేశ్వరరావుగారు అద్భుతమైన వాచకంతో అల్రించేవారు.


ఆసమయంలోనే 'శివశ్రీ'యని ఓ కొత్తనటుడు హరిశ్చంద్రుని వేషంవేసేవాడు.అతనిది తణుకో బందరో బాగా గుర్తులేదు.

ఆ కింకరుడే రాజగు రాజె కింకరుడగున్ --అన్న మాటలను నాటకంలో
పదే పడే సందర్భానుసరంగా పదే పదే అనడం బాగా నప్పింది.

మా పెదనాన్న గారికి ఈ నాటకాలంటే ఎక్కువ ఇష్టం.స్వయంగా పాదుకా పట్టాభిషేకమనే నాటకమ్రాసి ఊరిలోని వాళ్ళతో ఆనాటకాన్ని పలు చోట్ల ప్రదర్శించి ప్రశంసలనందుకున్న ఘనుడాయన. ఈ నాటకంలో దశరధుడివేషం వేసి జనంచేత కన్నేఏళ్ళను పెట్తించేవారని చెప్పుకునే వారు ఆయన్నుగురించి.
===============================================================

No comments:

Post a Comment