Wednesday, March 4, 2015

శేష ప్రశ్న
-------------



నువ్వంటున్న్నదేదో నాకు అక్షరాలా అర్ధమవుతున్నది.
ప్రేమకు పరాకాష్ట పెళ్ళి బంధమొక్కటే కాదనిపిస్తున్నది.

చెట్లను ప్రేమించేవాడూ పూల మొక్కలనుప్రేమించేవాడూ ఉన్నారుగదా
వాళ్ళు వాటిని మెడలోకట్టుకుని ఊరేగడమూ లేదన్నది నిజమేననిపిస్తున్నది.


మాతృభాషను ప్రేమించడం మన తక్షణ కర్తవ్యమేనని పిస్తున్నది.
దేశాభిమానమూ కొరవడడం తగదన్నది యదార్ధమేననిపిస్తున్నది.

గుండెగొంతుకలోంచి పలికే మాటలు
 గొప్ప గౌరవాన్నిసంతరించుకుంటున్నది.


దేశాన్నీ సొంత భాషనూ ప్రెమించలేని వాడిని

బంధాలకు కట్టుబడకుండా ప్రవర్తించడమే మేలుగా తోస్తున్న్నది.
నిన్ను ప్రేమించి పెళ్ళాడడం ఒక్కటే శేషప్రశ్నగాతోస్తున్నది.
========================================

No comments:

Post a Comment