Saturday, March 7, 2015

ఆ ఒక్క అశ్రు కణo------
------------------------
నీకళ్ళలో కనిపించే స్వప్నంకోసం
నీ పెదాలపై పరిమళించే చిరు దరహాసంకై
నీ హృదయాంతరాళాల్లో నినదించే గానమై
నీ కదలికల్లో కనుపట్టే వసంత శోభకోసం
నీ అస్తిత్వంలో తొణికిసలాడే ఆనందంకై
గుండె గొంతులోంచి పలికే ప్రణయానుస్వరమై
నీ తోటలో విరబూసిన సుమాలకై
తద్వారా ప్రసరించే పరిమళాలకోసం
నీ దగు ప్రపంచంలోప్రభవించే సూర్య కాంతికై
అన్ని అమృతతుల్యమౌ మధురమైన క్షణాలను
ఆత్మీయస్పర్శతో ఆ అనందాన్ని అనుభవించేందుకు
నా కనుకొలకుల్లోంచి జారిపడబోతున్న
ఈ ఒక్క అశ్రు కణాన్నీ తుడిచేసుకోవడం
గొప్పని నేను ఎప్పుడూ భావించను సుమా!!
----------------------------------
[ ఆంగ్లం: ప్రీతా చంద్రన్-- కవయిత్రి అనుమతితో]

No comments:

Post a Comment