Saturday, March 28, 2015

ఒక్క రోజయినా--ఓ యేడాదయినా---
---------------రావెల పురుషోత్తమ రావు.
----------------------------------------------

ఒక్క యేడాదిపాటు మాత్రమే నాకాయ్యుస్షు ఉందనితెలిసినా
కంగారు ఏమాత్రం పడనని వాగ్దానం చేస్తున్నాను.
హాయి హాయిగా ఈ ఆనందనందనవనంలో ఓ చిన్నిపూవునై
పరిమళ భరితంగా బ్రదుకును సాగిస్తాను.

ఇతరుల అవసరాలకు ఆదుకునే ఓ మహదవకాశం వచ్చిందని భావిస్తాను.
ఒక సంవత్సరంపాటు నాప్రేమాభిమానాలను తోటి సోదరులకు
హృదయపూర్వకంగా పంచి పెట్టే అవకాశం ఇచ్చినందుకు
ఆ భగవానుడిని మనసారా అభినందిస్తాను.

సంవత్సరం పాటు గుండెనిండా మoదహాసాలను వెలయించే అవకాశం
నాకు దక్కిందని కృతజ్ఞతా భావంతో ఇత :పూర్వం లాగానే సహకరిస్తూపోతాను.

ఇకపైన ప్రతిరోజునూ అమూల్యమైనదిగా భావిస్తూ
విలువలకు కట్టుబడి జీవితాన్ని అమూల్యంగా తీర్చిదిద్దుకుంటాను.

అది ఇకపైన ఏడాదిపాటయినా , ఒకేఒక్కరోజయినా పర్వాలేదు.

తోటిమానవుల జీవితాల్లో ఉషస్సులునింపడాన్నికి కళ్ళల్లో
వెలుగులతో కాంతివంతంగా తీర్చి దిద్దడానికీ వెచ్చిస్తాను.
కృతజ్ఞతాభావంతో ఆ యజమాని అందించిన ఈ చిరు అవకాశాన్ని
ఫలవంతంజేసుకుంటూ ఇతరులకు ఆదర్శవంతంగా మెలగేలా కృషి చేస్తాను.
================================================
[ ఓ ఆంగ్లకవిత చదివాక]

No comments:

Post a Comment