Saturday, March 21, 2015

ఉగాది విషాదగీతం
----------------
కొమ్మ మీద కోయిలమ్మ
కొత్త పాట పాడనంది
పాతపదమే పాడుకుంటు
పరవసించి పోతున్నది.

సరిగమలతో సౌమ్యమైన
సినిమా  సంగీతం
వాద్య ఘోషల నడుమ
బక్కచిక్కిపోతున్నదని
అహరహమూ బాధను ప్రకటిస్తున్నది.

పచ్చని పైరగాలులకోసం
రాతి భవనాల రాజధానికి
ఎంతదూరం జరిగిపోవాలని?
వివార వదనంతో ప్రశ్నిస్తున్నది

పండ్లతోటలన్నీ నేలకు రాల్చివేస్తే
తన నివాసం ఎక్కడుంటుందోనని
ప్రభుత్వ యంత్రాంగాన్ని
పదే పదే నిలదీస్తున్నది.

గిజిగాడు తదితర పక్షులకు
సానుభూతిగా తను విషాద
 గీతాల నాలపించడంతప్పదని
అందరినీ హెచ్చరిస్తున్నది.

కొమ్మ మీద కోయిలమ్మ
కొత్త పాట పాడనంది
పాతపదమే పాడుకుంటు
పరవశించి పోతున్నది.
=================================




No comments:

Post a Comment