Wednesday, March 11, 2015

క్షత గాత్రం--
------------------
తుండు గుడ్డలా పిండేసి మనసును
తను తుర్రు మంటూ జారిపోయింది.
పిచ్చుక కున్న చిన్నిపాటిప్రేమనుగూడా
ప్రకటించకుండానే
పలాయనం చిత్తగించింది.

కవితనింకా కలంపూర్తిగా
రాసి పడేయకముందే
కలాన్ని గిరాటేసి
రుస రుసలాడుతూ
 నే రానికపొమ్మ్మంటూ
రయ్ రయ్ మంటూ సాగిపోయింది.

తనతో తెచ్చుకున్న
చీకటినంతా చీరకొంగులోంచి
నాపైకి దులిపేసి
నయగారంగా నడిచి
వెళ్ళిపోయింది.

ప్రేమగా నేనిచ్చిన మల్లెల
రెక్కలన్న్నింటినీ తుంపి
పక్కమీదపడేసి
పరాకుగా నిష్క్రమించింది.

వెలుగు రేకలనన్నింటినీ
వెన్వెంటనే తన గుండె లోకి
వేగంగా సర్దేసుకుని
విసురుసుగా వెళ్ళిపోయింది.

ఆఖరుకు నన్ను
అసంపూర్తి కవితలా గిరాటేసి

అంతరంగ గవాక్షానికి
అక్షరాలా వీడ్కోలు చెప్పేసి

ఇటు తిరిగి చూడకుండానే
విసుగును ప్రదర్శిస్తూ వీద్కోలు
చూపులను నా గుండెలోకి
గునపంలా గుచ్చేసి
గుర్తులన్నింటినీ గుంభనంగా
చెరిపేసుకుంటూ గునుస్తూ సాగిపోయింది.

ఇప్పుడిక మిగిలిందల్లా నేనూ నా చీకటి
గుర్తుకు వచ్చి గోడకుర్చీ వేయించే
ఆ చేదు జ్ఞాపకాలు.
సుడిగాలిలా చుట్టబెడుతూ
సుర్రుమంటూ కాల్చేసే
చురుక్కుమంటూ సూదిమొనలా
గుచ్చుతూ  కత్తి వాదరపై
కదిలిపోయే గతించిన
ఏ ఉషస్సుకూ అందకుండా

సంసారంలో సగందారిలో ఆగిపోయి
కలతపెడుతుండే ప్రణయ పయోధి జలతరంగాలు
చిత్తగించిన ఆ రాణీ  -ప్రణయోద్దీపనాంతరంగ పు
  ప్రేమ పురస్సరంగా మిగిల్చిన జీవన గాధా సప్తశతులు.

----------------------------------------------------------------

No comments:

Post a Comment