Wednesday, March 25, 2015

నీవున్నావు నీపాటా----
================

మనో వల్మీకంలో కూరుకు పోయిన
మధుర స్మృతులనన్నింటినీ
ఒక్కొక్కటిగా వెలికితీయాలి.

గుండె గొంతుకలో తారాడుతూ
అర్ధాంతరంగా నిలిచిపోయిన
రమణీయార్ధాలన్నింటినీ
వెదకి మరీ బయటకు లాక్కు రావాలి.


ఇన్ని దశాబ్డాలయినా నీపాట
నా చెవులవద్దనింకా నిరంతరం
మృదు మధుర స్వనంతో శ్రవణపేయంగా
నినదిస్తూ వీనులకు విందుగావిస్తూనే వున్నది.

అందుకే అనునిత్యం నీవున్నావు నీపాటా
ఉన్నదన్న సత్యానికేనేనుకట్టుబడివున్నాను సుమా!

సుమసోయగాలు ప్రకృతిమాతను పరవశింపజేస్తున్నంతకాలం
సెలయేరులగలగలలుమనలకు సేయంగల విన్నపాలను
పూసగుచ్చినట్లు వివరిస్తూ పోతున్నంత కాలం
చివురాకుల ఊయలలో చిరుదరహసాల వసంత యామిని
నిత్యయవ్వనంతో విరాజిల్లుతున్నంతకాలం
నీవున్నావు నీపాటా నాలో ప్రతిధ్వనిస్తూనే వుంటుందని
నీకుమరీ మరీ ఇందుమూలముగా తెలియజేయడం నాధర్మంగా భావిస్తున్నాను.
======================================================



No comments:

Post a Comment