Wednesday, March 4, 2015

విస్మయగీతం-----రావెలపురుషోత్తమ రావు
===========================

గాలి బాగా జబిరినప్పుడు
చెరువుగట్టుమీద చెట్లన్నీ
పూనకం వచ్చిన వాటిలా
ఊగిపోతుంటే భయమేసి,గబ గబా
అడుగులు ముందుకు వేసుకుంటూ నడిచాను.
మూల చింతచెట్టు కూడా మనాది వొచ్చిన దానిలా
జుట్టుపీ క్కుంటూ  పిచ్చి పట్టిన దానిలా ప్రవర్తిస్తున్నది.

ఓ ఎండుటాకు గట్టి శబ్దంజేస్తూ
నేలమీద రాలిపడింది .జాలితలచిన గుండే ఒక్కటీ
కనబడలేదు--కాలంతీరింది రాలిపడకతప్పదని
వైరాగ్య భావనలు ప్రకటించి అందరూప్రక్కకు తప్పుకున్నారు.

పూరిగుడిసె పైనుంచి ఓ దంటుపుల్ల కిందకు రాలిపడిండి.
ఆఇంటి యజమాని సమయమెంతన్నది లెక్కపెట్టకుండా
చొపారం మీదకెక్కి నాలు గు నాపరాళ్ళముక్కలను పరిచి
దిగొచ్చి అమ్మయ్య ఇక పర్వాలేదనుకుని హాయిగా నిద్రపోయాడు.
మట్ట్టిమిద్దెల వాళ్ళు పైనుంచి సన్న సన్నగా రాలిపడే
వానచుక్కలను రాగిబిందెల్లోనో సిబ్బిరేకుల పళ్ళేలలోనో
పట్టుకుని ప్రమాద నివారణ దిశగా చర్యలు చేపడతారు.

అందరికీ బాధకలిగించెవిషయమల్లా
ఆకుపచ్చని ఆకులు నునులేతదనం వసివాడకముందే
అకస్మాత్తుగా వచ్చి పడే గాలివానలకొ
సుడిగాలులకో రాలిపడినప్పుడే అందరూ
గుండెలవిసిపోయేలా విలపిస్తారు!
అకాలమృత్యు హరణం సర్వ వ్యాధి నివారణమంత్రం
ఎందుకు వారిపట్లపనిచేయలేదా అని విస్మయానికిలోనవుతారు.

No comments:

Post a Comment