Monday, March 16, 2015

తలబోడుగాదు
తలపులూ బోడులుగానెకావు.

నిన్నటిదాకా మ్రోడు వారిన రూపంతో
మొహం మొత్తిన తరుసంపదంతా
నూత్న మర్యాదను చేజిక్కించుకుని
గాలులు వీచే దిశనుకనిపెడుతూ
శిర~హ్ కంపనలు మొదలెడుతున్న
శుభఫ్హడియల సుముహూర్తవేళలు.

కొత్త చొక్క తొడుక్కున్న కుర్రాళ్ళలా
మొహాలనీ నాలుగునెలలపాటు
మృగ్యమైన మొహాలన్నీ
కొంగ్రొత్త చివుళ్ళతో
కళకళ లాడిపోతున్నాయ్.

నిన్నటిదాక ఐపులేకుండా జాడకూడా
అవగతంకాకుండా యే వల్మీకంలోకో వెళ్ళయనుకున్న
విహంగాలన్నీ మూకుమ్మడిగా చెట్లపైకిజేరి
సమూహికంగా సభా మర్యాదలను పాటిస్తూ
సమావేశమయి పరస్పర సహకారాన్నందించుకుంటూ
హరిత శోభతో పరిసరాలనన్నింటినీ అలంకరిచుకుంటున్నాయ్.

ఇంకా పొద్దెక్కి చాలా సేపయినా కార్యాలయాలకు
వడివడిగా వెళుతూ వినిపించడమ్మొదలవని కారు కూతలు.

బద్ధకంగా మేఘాల మృదుకౌగిళ్ళలను వదిలించుకుని
అరుణారుణ రేఖలతో ఉదయించక తప్పదా అనుకుంటూ
నేను ప్రవేశిస్తున్నానహో అంటూ రాక సబ్డాలు వినిపించగానే
ఉలిక్కిపాటుతో వినిపించే సుప్రభాత గీతాల సంగతులు.

ముందుగా నా రాకను పసిగట్టయేమోమరి
ఇంటిపెరట్ళో పూసేస్తున్న సుమపరిమళ సుమగంధాలు.
నాదాకా వచ్చి తమనునులేతా లతలతో పులకింపజేయాలని
తహతహ పడుతున్న దాఖలాలు సుపష్టంగా కనుపిస్తున్నావి.

పసువులకొష్టంలోనుంచి మాకు దాణా వెయ్యండిరో అంటూ
ఆపసుగణం పెడుతున్న ఆకలి కేకల పరంపరలు.
ఇదంతా రాబోయే వసంతునికినేపధ్యమై అలరారుతున్నది.

No comments:

Post a Comment