Friday, March 13, 2015

హేతు శాతోదరిన్-------
------------------

చిలక్కొయ్యకు వేలాడదీసిన 
తొడుగుచొక్కాలా
అవునా కాదా అన్న సందిగ్ధ
మౌ విచికిత్సలో ఎందుకు నీ మనసు మౌనంగా
వేలాడడం చూస్తే గుండే తరుక్కుపోతుంది.
కారణం వివరించలేవా కడు ప్రియమైన స్నేహితుడా?

గడ్డకట్టిన జలాశయంగూడా
వసంతం వాకిట్లోకి వస్తుందని తెలియగానే

స్రవంతిలా పరకాయప్రవేశం జేసి
వడివడిగా పారడానికి సిద్ధమౌతుంది.
శిశిరంలో తిన్న చీవాట్లన్నింటికీ
ఒకే ఒక్క సమాధానంలా ఎందు గడ్డికూడా
హరితవర్ణ శోభతో నవలాడుతూ
వసంత యామిని నడచివవ్చ్చేందుకు వీలుగా
సుతిమెత్తగా తనరూపాన్ని సరిదిద్దుకుని
అభిసారికలా ఆ నవమన్మధుని రాకకోసం
ప్రతీక్ష చేసే సుందర దృశ్యం వర్ణించనలవిగాదు.

మ్రోడుబారి మొండిదానిలా ఇంటెదురుగా దిష్టిబొమ్మలా
నిలబడి నిలువుదోపిడీకి గురయిన నిర్భయ [జ్యోతి]లా
నిరామయంగా ఉన్న తరు శాఖలన్నీ  కనులకింపయిన పచ్చటి
రంగు పులుముకుని మేం స్వాగతం పలికేందుకు సర్వం సిద్ధమంటూ
ముస్తాబయి ముచ్చటగొలుపుతున్న తీరు ఎవరా జతగాడు?
అని అందరూ సహస్రాక్షులుగా మారి ఎదురుచూస్తుంటే
ప్రకృతిమాత పరవశానికి ఇంకా అర్ధం తెలీదంటావేం మిత్రమా?
==================================================================


No comments:

Post a Comment